ప్రస్తుతం దేశం మొత్తం సినీ ప్రియుల మాటల్లో వినిపిస్తున్న పేరు కెజియఫ్ 2. ఈసినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ట్రిపుల్ ఆర్ ప్రభావాన్ని కూడా తగ్గించి, తన వైపు ఆడియన్స్ ను తిప్పుకున్న సినిమా కెజియఫ్ చాప్టర్2. ఇక ఈసినిమాను ఇంతలా హిట్ చేసినందుకు ఆడియన్స్ కు కెజియఫ్ టీమ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
ప్రస్తుతం దేశం మొత్తం సినీ ప్రియుల మాటల్లో వినిపిస్తున్న పేరు కెజియఫ్ 2. ఈసినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ట్రిపుల్ ఆర్ ప్రభావాన్ని కూడా తగ్గించి, తన వైపు ఆడియన్స్ ను తిప్పుకున్న సినిమా కెజియఫ్ చాప్టర్2. ఇక ఈసినిమాను ఇంతలా హిట్ చేసినందుకు ఆడియన్స్ కు కెజియఫ్ టీమ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
కన్నడ నాట నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన కెజియఫ్ మూవీ సృష్టిస్తున్ ప్రభంజనంఅంతా ఇంతా కాదు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 రోజులు దాటినా..కెజియఫ్ మ్యానియా ఏమాత్రం తగ్గలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసిన కేజీఎఫ్-2 హవానే నడుస్తుంది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ యంగ్ స్టార్ యష్ నటించిన ఈమూవీ లో ప్రశాంత్ నీల్ టేకింగ్, ఆయన విజన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. దాంతో ఈసినిమాను మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రేక్షకులు రిపీటెడ్‌గా వస్తున్నారు. యష్ నటన, అభినయానికి ప్రశంసలు వర్షం కురుస్తోంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల మార్క్ కలెక్షన్స్ దాటిన ఈసినిమా ఒక్క బాలీవుడ్‌లోనే 300కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కు రవిబస్రూర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో మూవీ చూసిన ప్రతీ ప్రేక్షకుడికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాంతో ఈమూవీ మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఈసినిమా సక్సెస్ తో ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
కెజియఫ్ చాప్టర్ 2 లోనుంచి ఎవ్రిబడి ఈజ్ ఎ గ్యాంగ్ స్టర్.. టిల్ యు సీ ద మాన్‌స్టర్’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా టైటిల్ కార్డులో వచ్చే ఈ పాటకు అదితీ సాగర్ సాహిత్యం అందించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన కెజియఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మెయిన్ విలన్ గా అధీరా పాత్రలో అలరించాడు. కీలకపాత్రలో రావు రమేష్, ప్రకాశ్ రాజ్, రవినా టండన్ లాంటి సీనియర్స్ కనిపించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించాడు. వెయ్యికోట్ల కలెక్షన్ మార్క్ లక్ష్యంగా కెజియఫ్ చాప్టర్2 మూవీ దూసుకుపోతోంది.