ఈ మూవీపై ఏర్పడిన భారీ అంచనాలతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఇటు భారత్‌తో పాటు అటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది. ఓవర్సీస్‌లో ఏకంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ నెల 14న 'కేజీఎఫ్ చాప్టర్-2', సినిమాను రిలీజ్ చేసింది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్-2'. ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ నుఅందుకుంది. అంతకుముందు సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కడంతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
ముఖ్యంగా యశ్ ఎలివేషన్స్, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉండడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీపై ఏర్పడిన భారీ అంచనాలతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఇటు భారత్‌తో పాటు అటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది. ఓవర్సీస్‌లో ఏకంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ నెల 14న 'కేజీఎఫ్ చాప్టర్-2', సినిమాను రిలీజ్ చేసింది.
'కేజీఎఫ్ చాప్టర్-2', అంతకుముందు మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అగ్రరాజ్యం అమెరికాలో రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లాయి. ఈ రెండు సినిమాలు యూఎస్‌లో భారీ మొత్తంలో కలెక్షన్‌లను రాబట్టాయి. మరో ప్రక్క RRR కంటే KGF 2 పెద్ద హిట్ అని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి, $4.15 మిలియన్ల (అన్ని భాషలు) ఫస్ట్ వీకెండ్ తర్వాత, KGF 2 అమెరికా భాక్సాఫిస్ దగ్గర డ్రాప్ స్టార్ట్ అయ్యిపోయింది. రెండో శుక్రవారం వచ్చేసరికి KGF 2 కేవలం $93K (సౌత్ లాంగ్వేజెస్) దగ్గర ఆగిపోయింది. అయితే అదే ఆర్.ఆర్.ఆర్ రెండో శుక్రవారం వచ్చేసరికి $422K సాధించింది. ఆర్.ఆర్.ఆర్ మూడో శుక్రవారం సాధించిన $150K ని కూడా కీజీఎఫ్ 2 రెండో వారం దక్కించుకోలేకపోయింది.
అయితే చాలా మంది ఈ డ్రాప్ ని కవర్ చేయటానికి కేజీఎఫ్ 2 చిత్రం ఓ డబ్బింగ్ సినిమా అని గుర్తు చేసుకోవాలంటున్నారు. ఇది ఓపినింగ్స్ తెచ్చుకోగల మాస్ సినిమా మాత్రమే అని అంటున్నారు. అయితే ‘కేజీఎఫ్-2’ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజే 130కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్‌లో ఖాన్, కపూర్‌లను వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. విడుదలైన 2 రోజుల్లోనే ఈ చిత్రం బాలీవుడ్‌లో బ్రేక్ఈవేన్‌ను పూర్తి చేసుకుంది.ఇక తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో మరో ఘనతను సాధించింది.
తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో 300కోట్ల క్లబ్‌లో నిలిచింది. 300కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 9వ సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు సృష్టించింది. అంతేకాకండా బాహుబలి-2 తర్వాత ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంలో కేజీఎఫ్ చాప్టర్-2 నిలిచింది. ఇటీవలే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం 800కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై రవి కిరగందూర్ నిర్మించాడు.