మహానటి సినిమాలో మంచి మనసున్న సావిత్రి పాత్ర చేసిన కీర్తీ సురేష్. నిజ జీవితంలో కూడా మహానటి అనిపించుకుంది. తన సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కు కాస్ట్లీ గిప్ట్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. 

మహానటిలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్.. తన దగ్గరకు సాయం కోసం వచ్చినవారికి .. చేతికోచ్చినంతగా  సాయం చేస్తుంటుంది. మహానటి పాత్రలో అంతలా  ఒదిగిపోయిన కీర్తీ.. నిజ జీవితంలో కూడా మహానటి అనిపించుకుంది. తన సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కు కాస్ట్లీ గిప్ట్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ కీర్తీ ఇచ్చిన ఆ కాస్ట్లీ గిప్ట్స్ ఏంటీ..? 

సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ ను ప్రేమగా చూసుకుంటారు కొంత మంది మేకర్స్.. నిర్మాతలే కాదు దర్శకులు, హీరోలు, హీరోయిన్లు కూడా తమ టెక్నీషియన్స్ కోసం ఏవో ఒక గిప్ట్ లు ప్లాన్ చేస్తుంటారు. గతంలో తన సినిమాకు పనిచేసిన వారికి ఏకంగా ఇళ్ళు కట్టించి ఇచ్చాడు డైరెక్టర్ తేజా. ఇలా హీరోలు, హీరోయిన్లు కూడా.. వాచ్ లు, డబ్బు, కాయిన్స్  కొత్త కొత్తగా ఏదో ఒక బహుమతులు ఇస్తుంటారు. ఈక్రమంలో కీర్తి కసురేష్ కూడా తన సినిమాకు పనిచేసిన వారికి కాస్ట్లీ గిప్ట్స్ ఇచ్చిందట. 


కీర్తి సురేష్ సినిమా మొత్తం పని చేసిన టెక్నీషియన్స్, వర్కర్స్ లో దాదాపు 130 మందికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. వీటి విలువ దాదాపు 70 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దాంతో  కీర్తి సురేష్ చాలా మంచి  మనసున్న అమ్మాయి అని టీమ్ అంతా మెచ్చుకుంటున్నారు.  ఈ విషయంలో టెక్నీషియన్స్ అంతా దిల్ ఖుష్ అవ్వడంతో పాటు.. మీడియాతో కూడా  కీర్తి సురేష్ గొప్ప మనసు గురించి చెపుతూన్నారు. 

 అంతే కాదు సెట్ లో కీర్తీ సురేష్ సింపుల్ గా ఉంటారని.. ఆమె మంచి నటి మాత్రమే కాదు..మంచి మనసు ఉన్న వ్యాక్తి కూడా అని అంటున్నారు టీమ్... మాతో పాటు కింద కూర్చొని తింటారు.. సెలబ్రిటీ అని పొగరు కాని.. గర్వం కాని చూపించరు.. షూట్ లో గ్యాప్ వస్తే మాతో పాటు వచ్చి కబుర్లు చెప్పుతారు.. ఒక  హీరోయిన్ లా కాకుండా మాలో ఒకరిగా కలిసిపోతారంటూ.. కీర్తి గురించి గొప్పగా కీర్తించారు.  చెప్పాడు. దీంతో కీర్తి అభిమానులతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కీర్తి మంచితనం గురించి మెచ్చుకున్నారు.

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేలు డైరెక్ట్ చేసిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో మార్చి 30న రిలీజ్ కాబోతోంది.  పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మూవీ టీమ్. నానీ అండ్ టీమ్ రెస్ట్ లెస్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఈసందర్భంగా హీరోయిన్  కీర్తి సురేష్ సహాయం  గురించి న్యూస్ వైరల్ అవుతుంది.