బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ డిఫరెంట్ కామెంట్ తో ఒక్కసారిగా అందరికి షాకిచ్చింది. సహజీవనంపై మాట్లాడుతూ ఆమె ఒక సీనియర్ హీరోయిన్ పేరును ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం భరత్ సినిమా ప్రమోషన్స్ తో అమ్మడు బిజీగా ఉంది. 

సల్మాన్ ఖాన్ నటించిన భరత్ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 5న రిలిజ్ కానుంది. అయితే ఆడవారితో సహజీవనం చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కత్రినా ఈ విధంగా సమాధానం చెప్పింది. కరీనా కపూర్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తానంటూ.. ఆమె జీవిత భాగస్వామి అయితే చాలా బావుంటుందని కూడా వివరణ ఇచ్చింది. 

కరీనా గురించి మాట్లాడుతూ.. ఆమె అందమైన నటి. అలాగే మంచి ధైర్యంగల మహిళ కూడా అని ఆమెతో వర్క్ చేస్తే కూడా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని కత్రినా సమాధానమిచ్చారు.