Asianet News TeluguAsianet News Telugu

`కాంతార` కలెక్షన్ల సునామీ.. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

కన్నడ చిత్రం `కాంతార` రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఊహించని విధంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. 

kantara movie collected record collection never expected
Author
First Published Nov 16, 2022, 4:20 PM IST

సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. రొటీన్‌ కథలకు కాలం చెల్లింది. రీమేక్‌లు ఆదరణ పొందడం లేదు. ఒరిజినల్‌ కంటెంట్‌ దుమ్మురేపుతుంది. కథలో దమ్మున్న సినిమా భాషలకు అతీతంగా ఆదరణ పొందుతుంది. `పుష్ప`, `కేజీఎఫ్‌`, `ఆర్‌ఆర్‌ఆర్`, `విక్రమ్‌`, `కార్తికేయ 2`, `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పుడు `కాంతార` చేరింది. ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి రూపొందించిన `కాంతార` చిత్రం గత నెలలో విడుదలైంది. మొదట కన్నడనాటే విడుదలైన ఈ సినిమా వారం పది రోజుల గ్యాప్‌తో తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనూ విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. నెమ్మదిగా పుంజుకుంటూ దుమ్మురేపుతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. థియేటర్లని పెంచుకుంటూ దుమారం రేపుతుందీ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ఊహించని కలెక్షన్లని సాధించింది. అన్ని భాషల్లో కలిసి ఏకంగా 350కోట్లు వసూలు చేయడం విశేషం. 

తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.350కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది. కేవలం ఓ భాషలో ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ రేంజ్‌లో కలెక్షన్లని సాధించడం ట్రేడ్‌ వర్గాలను, సినీ వర్గాలను సైతం షాక్‌కి గురి చేస్తుంది. కంటెంట్ తో రక్తికట్టించేలా, జెన్యూన్‌ ఎమోషన్స్ తో సినిమా తీస్తే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారనేదానికి `కాంతార` ఉదాహరణగా నిలుస్తుంది.  

ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. సౌత్‌ కర్నాటక నేపథ్యంలో భూతకోల అనే సాంప్రదాయ కళ, పండగ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఇక్కడ యాభై కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios