Asianet News TeluguAsianet News Telugu

ట్రోలింగ్ కు భయపడ్డ ‘క‌బ్జ’డైరక్టర్, డిలేట్ చేసేసాడు?

 అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన కబ్జ మార్చి 17న కన్నడ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. 

Kabzaa Director Takes Down The Worldwide Box Office Collection Poster
Author
First Published Mar 19, 2023, 7:00 PM IST


సోషల్ మీడియా వచ్చాక ప్రతీది డిస్కషన్ లో ఉంటోంది. ముఖ్యంగా ఏదన్నా తేడా వస్తే ట్రోల్ చేసేస్తున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి.  సినిమా కలెక్షన్స్ విషయంలో అయితే అది మరీ ఎక్కువ ఉంటోంది. జనాలు అన్ని గమనించి ఎక్కడ వచ్చాయి..ఆ కలెక్షన్స్ అని నిలదీస్తున్నారు. తాజాగా ఈ పరిస్దితి ని గమనించే కబ్జా దర్శకుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో షేర్ చేసిన కలెక్షన్ పోస్టర్ ని డిలేట్ చేసేసారని సమాచారం 

వివరాల్లోకి వెళితే..కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kitcha sudeep)ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క‌బ్జ’. ఆర్‌.చంద్రు ద‌ర్శకత్వం వహించాడు. ‘కేజీఎఫ్’ , ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బాస్టర్‌ ప్రాంచైజీ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన కబ్జ మార్చి 17న కన్నడ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. శివరాజ్‌ కుమార్‌, శ్రియా శరణ్‌, సుధ, మురళీ శర్మ, నవాబ్ షా, సునీల్ పురాణిక్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  కలెక్షన్స్ పూర్తి డ్రాప్ గా ఉన్నాయి. 

అయినా సినిమాకు హైప్ క్రియేట్ చేయటానకి ఎక్కువ  కలెక్షన్స్ తో రెడీ చేసిన పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు దర్శకుడు, టీమ్. అయితే ఆ పోస్టర్ రిలీజ్ చేసిన కాసేపటికే భయంకరమైన ట్రోలింగ్ మొదలు కావటంతో దాన్ని డిలేట్ చేసేసారు. ఇక ఇప్పుడు రెండు రోజుల్లోనే వంద కోట్లు అంటూ మరో పోస్టర్ వెలిసింది. అది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. 

మరో ప్రక్క  ఉపేంద్ర అండ్ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. ఉపేంద్ర టీం కేక్‌ కట్‌ చేసి.. ఒకరికొకరు తినిపించుకుని కబ్జ సక్సెస్‌ను అందరితో పంచుకున్నారు. ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కబ్జ అన్ని భాషల్లో  ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందంటున్నారు ట్రేడ్ పండితులు.   కేజీఎఫ్‌ ఫేం ర‌విబ‌స్రూర్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతోంది. కబ్జ హిందీ వెర్షన్‌ 1604కు పైగా థియేటర్లలో విడుదలయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios