Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu: రిషి పై సెటైర్లు వేసిన వసు.. కొడుకుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్న మహేంద్ర జగతి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

Jagathi gives a piece of advice to mahendra in todays guppedantha manasu serial gnr
Author
First Published Mar 20, 2023, 7:38 AM IST

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార లోపలికి రావచ్చా సార్ అని అనగా రా అని పిలుస్తాడు రిషి. ఏంటి పిలవగానే రావాలని తెలియదా అని అంటూ ఆఫీస్ వర్క్ ఉంది సార్ అనగా మరి నాకే వర్కు లేదా అని అంటాడు రిషి. అప్పుడు ఏం వర్క్ ఉంది సార్ అంటూ సెటైర్లు వేస్తుంది వసుధార. అసలు నువ్వు ఏం చేస్తున్నావు వసుధార అనడంతో ఆగండి సార్ నేను చెప్తాను అని మీరు లిఫ్ట్ ఇవ్వలేదు క్యాబ్ లో వద్దామంటే అవి లేటుగా చూపిస్తున్నాయి అందుకే స్కూటీలో వచ్చాను అని అంటుంది. ఈ విషయం గురించే కదా సార్ మీరు అడగాలనుకుంది అందుకే కదా సార్ మీరు పిలిచింది నాకు తెలుసు సార్ అందుకే నేను ముందే చెప్పేశాను అని అంటుంది వసుధార.

ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి రమ్మని చెప్పలేదు అని అంటాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్స్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయి వాళ్లకు ఓకే అని మెసేజ్ పంపు అనడంతో ఒకే సార్ అని అంటుంది వసుధార. ఈ మెయిల్ కి విషయం గురించి డాడీకి మేడంకి చెప్పు అలాగే మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పు అని అంటాడు రిషి. ఆ వర్క్స్ అన్ని జగతి మేడం చూసుకుంటారు అని రిషి అనగా మరి నాకు ఏదైనా వర్క్ చెప్పొచ్చు కదా సార్ అనడంతో కావాలంటే నువ్వు జగతి మేడంకి అసిస్టెంట్ గా ఉండు అనగా దానికి డబ్బులు ఇస్తారా సార్ అని అంటుంది వసుధార. ఆ మాటకు రిషి ఆశ్చర్యపోతాడు. నేను పెళ్లి చేసుకున్నాను కదా సార్ నాకు ఖర్చులు ఉంటాయి మా వారేమో అనగా ఆపు చూద్దాంలే అని అంటాడు రిషి.

ఇప్పుడు బైక్ లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదా ఇప్పటినుంచి జాగ్రత్తగా ఉండు అని వసుధారకీ జాగ్రత్తలు చెబుతాడు రిషి. తర్వాత మిషన్ ఎడ్యుకేషన్  గురించి మాట్లాడగా అప్పుడు రిషి ఏం మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్తుండడంతో ఏం చెప్పలేదు సార్ అనగా రిషి ఉన్న ప్రతి చోట వసుధార ఉంటుంది అని చెప్పడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి ల్యాబ్ లోకి వెళుతుండగా వసుధర పరిగెత్తుకుంటూ వెళ్లి మీరు వెళ్ళొద్దండి సార్ మీరు వెళ్ళడానికి ఒప్పుకోను ఇంతకుముందు ఏం జరిగిందో గుర్తు ఉంది కదా అని అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ వసుధార నన్ను వెళ్ళనివ్వు అనడంతో ప్లీజ్ సార్ నా మాట వినండి నేను వెళ్ళను ఇక నుంచి వెళ్ళిపోండి అని అంటుంది వసుధార.

 ఇంతలోనే ఒకతను రావడంతో రిసీ సార్ ని ల్యాబ్ వైపు రాని వద్దు అని అతనికి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది వసుధార. నిన్ను చూస్తే కొన్ని కొన్ని సార్లు నాకు భవిష్యత్తునే మరిచిపోతావేమో అన్న అనుమానం వస్తోంది అనగా ఏది మరిచిపోయిన ప్రేమను మర్చిపోను అని అంటుంది వసుధార. ఒకసారి ప్రమాదం జరిగితే మళ్లీ మళ్లీ అలాగే జరుగుతుంది అని ఎందుకు అనుకుంటున్నావు అనడంతో ఇప్పుడు ఏం జరిగిందో మనకు సరిగ్గా తెలియదు అందుకే ముందు జాగ్రత్తగా చూపుతున్నాను సార్ అంటుంది వసుధార. అప్పుడు నువ్వు బాధ పెట్టావు ఇప్పుడు బాధ పెడుతున్నావు అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే అనడంతో మన మధ్య గొడవలు వచ్చాయి వెళ్లిపోయాయి సార్, కానీ మన ప్రేమ మాత్రం పోదు అని అంటుంది వసుధార.

తర్వాత రిషి,మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి భయపడుతూ వస్తాడు. అప్పుడు రిషి మహేంద్రను ఎందుకు బైక్ మీద వచ్చావు అంటూ ఫుల్ గా క్లాసు పీకుతాడు. అప్పుడు మహేంద్ర టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి డాడ్ ఇంకొకసారి ఇలా బైక్ మీద రాకండి మీ ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్త అని అంటాడు. సరే రిషి అని మహేంద్ర జగతి అక్కడి నుంచి వెళ్తారు. ఆ తర్వాత రిషి, వసు బైక్ ని కనిపించకుండా మాయం చేస్తాడు. అప్పుడు వసుధార బయటికి వచ్చి తన బైక్ లేకపోవడంతో నా బైక్ ఎక్కడికి వెళ్లింది అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రిషి సార్ ఏంటి ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు కొంపతీసి నా స్కూటీ సార్ దాచి పెట్టాడా అడిగితే పోలా అని అక్కడికి వెళుతుంది.

అప్పుడు వసు అక్కడికి వెళ్లి ఆ బైక్ కొట్టేసిన వాళ్ల గురించి తిడుతూ ఉండగా రిషి లో లోపల ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ సీసీ కెమెరా అని అనడంతో ఏంటి వసుధార ఆ భాష ఏంటి క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా అని అంటాడు రిషి. తర్వాత వసు,రిషి ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఆ తర్వాత దూరం నుంచి అది చూసిన జగతి మహేంద్ర ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇద్దరు ఒకటి అవుతున్నారు అని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ రిషి,వసు ల గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంత కాదు జగతి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాము మనకు వాళ్ళ పెళ్లి చేసే అదృష్టం లేదా అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ మహేంద్ర వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్లి గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా అని అంటుంది జగతి.

Follow Us:
Download App:
  • android
  • ios