Asianet News TeluguAsianet News Telugu

విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ.. గూస్ బంప్స్ తెప్పించే స్క్రిప్ట్ రెడీ ?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు 'ఉప్పెన' చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఉప్పెన చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. విలేజ్ లవ్ స్టోరీని బుచ్చిబాబు తన టేకింగ్ తో హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి.

Interesting details about NTR and buchibabu movie
Author
Hyderabad, First Published Jan 28, 2022, 5:12 PM IST

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు 'ఉప్పెన' చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఉప్పెన చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. విలేజ్ లవ్ స్టోరీని బుచ్చిబాబు తన టేకింగ్ తో హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి. వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా పరిచయం అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా బుచ్చిబాబు తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో. వీరిద్దరి కాంబినేషన్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ కి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడట. ఉప్పెన పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పారు. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు మేకింగ్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. 

బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం పీరియాడిక్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ కథని సిద్ధం చేసుకున్నారట. కథలో భాగంగా ఎన్టీఆర్ అనేక క్రీడల్లో ప్రావీణ్యం ఉండే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. 

ఎన్టీఆర్.. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించాడు. అప్పటి నుంచే ఎన్టీఆర్ తనతో చాలా బాగా మాట్లాడేవారని బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఉప్పెన చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఎన్టీఆర్, బుచ్చిబాబు చిత్రాన్ని కూడా ఆ సంస్థే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఇంకా విడుదల కాలేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ కొరటాల శివ, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కమిటై ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios