హాట్ బ్యూటీ ఇలియానాకు కుర్రకారులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ గోవా బ్యూటీ సోయగాలకు యువత మొత్తం ఫిదా అయ్యారు. టాలీవుడ్ లో దేవదాసుతో కెరీర్ ప్రారంభించిన ఇలియానా.. మహేష్ సరసన పోకిరి చిత్రంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంతో  తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. 

చాలా ఏళ్ల పాటు టాలీవుడ్ లో ఇలియానా హవా సాగింది. ఆ తర్వాత జరిగిన స్టోరీ అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పటికీ వదిలేసి బాలీవుడ్ మోజులో పడింది. తీరా అక్కడ ఈ నడుము సుందరికి తీవ్ర నిరాశే ఎదురైంది. 

టాలీవుడ్ ని వదిలేసి వెళ్లడంతో ఇక్కడ కూడా ఇలియానా క్రేజ్ పోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఇలియానాకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఇలియానా హాట్ ఫోజులతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. 

ఆండ్రు నిబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ఇలియానా ప్రేమాయణం కూడా సాగించింది. వీరిద్దరూ చాలా కాలం పాటు సహజీవనం చేశారు. ఈ విషయాన్ని ఇలియానా కూడా అంగీకరించింది. ఈ జంట సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

కాగా ఇటీవల ఇలియానా తన ప్రియుడితో బ్రేకప్ చేసుకుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలపై ఇలియానా స్పందించింది. తన ప్రియుడితో విడిపోయిన సంగతి నిజమే అని సోషల్ మీడియాలో తెలిపింది. 

మన జీవితంలో స్నేహితులు, సన్నిహితులు అందరిని కోల్పోక తప్పదు. కానీ మనల్ని మనం కోల్పోకూడదు. మన జీవితం నుంచి ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకు సాగాలి అని ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

తన ప్రియుడితో విడిపోయినప్పటికీ తానేం బాధపడడం లేదని ఇలియానా చెప్పకనే చెబుతూ మతిపోగోట్టే భంగిమలో బికినిలో పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఇలియానా బికినీ పిక్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Waiting for the sun to come out ☀️ • • • 📸 @colstonjulian 💥

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Sep 5, 2019 at 6:23am PDT