Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఎన్టీఆర్ కి రష్మిక మందాన కండిషన్స్? అలా అయితేనే నటిస్తా అంటూ!


ఎన్టీఆర్ తో సినిమా అంటే హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు. కానీ రష్మిక మందాన ఆయనకే కండిషన్స్ పెట్టిందట. తన డిమాండ్స్ కి ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని తెగేసి చెప్పిందట. 
 

heroine rashmika mandanna conditions to ntr movie ksr
Author
First Published Jun 6, 2024, 7:02 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందాన సౌత్ లో టాప్  హీరోయిన్ గా రాణిస్తుంది.  అటు బాలీవుడ్ లోనూ రష్మిక హవా సాగిస్తుంది. గత ఏడాది వచ్చిన యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో రష్మిక బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. 

ప్రస్తుతం రష్మికకు ఫుల్ డిమాండ్ ఉంది. పలు బడా ప్రాజెక్ట్స్ లో ఆమె నటిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దానిని ఎనౌన్స్ చేసి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. తారక్ తో సినిమా ఒకే చేసిన రష్మిక .. డైరెక్టర్ కి ఒక కండిషన్ పెట్టిందట. 

ఈ మూవీలో డీ గ్లామర్ రోల్ లో తాను నటించను అని చెప్పేసిందట. ఎందుకంటే పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ రోల్ లో కనిపించింది. అందుకే ఇప్పుడు మరోసారి డీ గ్లామర్ రోల్ లో నటించడానికి రష్మిక సిద్ధంగా లేదని టాక్ వినిపిస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ ఎలాగైనా ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబట్టడంతో ఒకే చేసిందట. ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 7 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోనుందని సమాచారం. 

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 తో బిజీగా ఉంది. ఇటీవల విడుదల కపుల్ ట్రేండింగ్ లో ఉంది. ఇక ఆగష్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ..  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో వస్తున్న కుబేర సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కి జంటగా ' చవ్వా ' మూవీ చేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్, రైన్ బో వంటి లేడీ ఓరియెంటెడ్ నటిస్తుంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios