Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార ఫెస్టివ్ లుక్..! మురిసిపోతున్న నమ్రత!

ఉగాది పండగ వేళ సితార ఘట్టమనేని కుందనపు బొమ్మలా తయారైంది. కూతురు ఫెస్టివ్ లుక్ షేర్ చేసిన తల్లి నమ్రత ముసిరిపోయారు. 
 

hero mahesh babu daughter stara ugadi festival look viral
Author
First Published Mar 22, 2023, 1:07 PM IST

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. బంధు మిత్రులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా తయారైంది. సితార ఫెస్టివ్ లుక్ ని నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురు అందానికి మురిసిపోయారు. అలాగే అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

సితార ఉగాది వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఈ చిచ్చర పిడుగుకి అప్పుడే చాలా విషయాల మీద అవగాహన ఉంది. సెలెబ్రిటీ రేంజ్ లో పోస్ట్స్ పెడుతూ ఉంటుంది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న సితార సెకండరీ గ్రాడ్యుయేషన్ లో అడుగు పెట్టారట. ఈ విషయం తెలియజేస్తూ నమ్రత తన ప్రౌడ్ మూమెంట్ ఫ్యాన్స్ తో షేర్ చేశారు.

త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. 

కాగా ఇటీవల నమ్రత పిల్లలతో పాటు విదేశాలకు వెళ్లారు. త్రివిక్రమ్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ ఈ ట్రిప్ మిస్ అయ్యాడు. సాధారణంగా మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్ అసలు మిస్ కారు. ఎక్కడికెళ్లినా మహేష్, నమ్రత, తమ ఇద్దరు పిల్లలు కలిసే వెళతారు. ఆగస్టు నెలలో మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న మహేష్ వీరితో పాటు ట్రిప్ కి వెళ్ళలేదు. ఎస్ఎస్ఎంబి 28 హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios