Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ వైఫ్ ఉగాది సెలబ్రేషన్స్... అల్ట్రా స్టైలిష్ గా కనిపించే స్నేహారెడ్డికి ఇన్ని పద్ధతులు తెలుసా!

హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఉగాది పండుగ కుటుంబంతో జరుపుకున్నారు. తమ పండుగ సెలబ్రేషన్స్ వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 

hero allu arjun wife sneha reddy shares a video of ugadi celebrations ksr
Author
First Published Mar 22, 2023, 7:04 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి అంటే తెలియనివారుండరు. స్టార్ హీరోకి భార్యగానే కాకుండా తనకంటూ ఓ ఇమేజ్, ఫేమ్ ఆమె సొంతం చేసుకున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ద్వారా ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో స్నేహారెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన అభిరుచులు, వ్యాపకాలు అభిమానులకు తెలియజేస్తారు. తన అందమైన ఫ్యామిలీని వీడియోల్లో బంధించి అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. 

తాజాగా ఆమె ఉగాది వేడుకల వీడియో షేర్ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు ఉగాది పండుగను ఘనంగా చేసుకున్నారు. ఉగాది పచ్చడి ప్రత్యేకంగా తయారు చేసిన స్నేహారెడ్డి, పలు వంటకాలు చేశారు. అందులో పులిహోర, గారెలు, పాయసం వంటివి ఉన్నాయి. పూజ గదిని, ఇంటిని చక్కగా అలంకరించారు. సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలను సిద్ధం చేశారు. స్నేహారెడ్డి ఉగాది పండుగ అమ్మవాళ్ల ఇంట్లో జరుపుకున్నట్లున్నారు. ఈ వీడియోలో స్నేహారెడ్డి పేరెంట్స్ మాత్రమే కనిపించారు. అల్లు అర్జున్ లేరు. 

బహుశా ఆయన పుష్ప 2 షూట్లో బిజీగా కావడం వలన రాకపోయి ఉండొచ్చు. ఫెస్టివ్ వేర్లో సూపర్ క్యూట్ గా ఉన్న అల్లు అయాన్, అర్హలను మనం వీడియోలో చూడొచ్చు. స్నేహారెడ్డి ఉగాది వేడుకల వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అల్ట్రా స్టైలిష్ గా కనిపించే స్నేహారెడ్డికి పండుగలు, పద్ధతులు గురించి ఇంత గొప్పగా తెలుసా! అని కామెంట్ చేస్తున్నారు.  

టాలీవుడ్ లవ్లీ కపుల్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం చేసుకుని 12 ఏళ్ళు అవుతుంది. 2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహారెడ్డి వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు వేశారు. ప్రేయసి స్నేహారెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి అర్థాంగిని చేసుకున్నారు.  స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కూతురు అర్హ అప్పుడే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో అర్హ బాల భరతుడు రోల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios