తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండ చిత్రానికి రీమేక్ గా వాల్మీకి చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ పై వివాదం కారణంగా విడుదలకు కొన్ని గంటల ముందు గద్దలకొండ గణేష్ అని మార్చారు. ఈ టైటిల్ కూడా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. 

గ్యాంగ్ స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ గెటప్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ పూజా హెగ్డే పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో గద్దలకొండ గణేష్ చిత్రానికి తొలి వీకెండ్ లో మంచి వసూళ్లు వచ్చాయి. వీక్ డేస్ లో ఈ చిత్ర వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ స్టడీగా కొనసాగాయి. 

తొలి వారం గద్దలకొండ గణేష్ చిత్రానికి 19.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 20 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి 17 కోట్ల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి, నెల్లూరు లాంటి ఏరియాల్లో బయ్యర్లు ఇప్పటికే లాభాలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్నిప్రాంతాల్లో గద్దలకొండ గణేష్ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. 

గద్దలకొండ గణేష్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో మాత్రం గద్దలకొండ గణేష్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో 2.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.1 కోట్లు, వెస్ట్ లో 1.2, ఈస్ట్ లో 1. 25 కోట్ల షేర్ రాబట్టింది. 

సెకండ్ వీక్ లో ప్రధానమైన చిత్రాలేవివిడుదల కావడం లేదు కాబట్టి ఇది గద్దలకొండ గణేష్ చిత్రానికి కలసి వచ్చే అంశం. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.