Asianet News TeluguAsianet News Telugu

Ekta Kapoor: ఏక్తా కపూర్ స‌న్ ర‌వి బ‌ర్త్ డే.. స్పెష‌ల్ వీడియోతో స్మృతి ఇరానీ విషెస్ !

Ekta Kapoor's son Ravie: ప్ర‌ముఖ న‌టీ, ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ కుమారుడు ర‌వి మూడో బ‌ర్త్ డే సంద‌ర్భంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌తున్నాయి. మూడేండ్లు నిండిన ర‌వికి బాలీవుడ్, సినీ ప్ర‌ముఖుల నుంచి బ‌ర్త్ డే విషెస్ అందుతున్నాయి. ర‌వి పుట్టిన రోజు వీడియోను ఎక్తాక‌పూర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

From "Maasi" Smriti Irani To Ekta Kapoors Little Son Ravie
Author
Hyderabad, First Published Jan 28, 2022, 2:46 PM IST

Ekta Kapoor's son Ravie:  ప్ర‌ముఖ న‌టీ, ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ కుమారుడు ర‌వి మూడో బ‌ర్త్ డే సంద‌ర్భంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌తున్నాయి. మూడేండ్లు నిండిన ర‌వికి బాలీవుడ్, సినీ ప్ర‌ముఖుల నుంచి బ‌ర్త్ డే విషెస్ అందుతున్నాయి. ర‌వి పుట్టిన రోజు వీడియోను ఎక్తాక‌పూర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. కాగా, ఏక్తా క‌పూర్ 2019లో సరోగసీ ద్వారా రవికి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. 
 
రవి మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఏక్తా కపూర్ స్నేహితురాలు,  రాజకీయవేత్త, మాజీ నటి స్మృతి ఇరానీ విషెస్ తెలిపారు. ఓ స్పెష‌ల్ వీడియోతో ర‌వికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్మృతి ఇరానీ పోస్టు చేసిన వీడియోలో ర‌వి ఆడుకుంటూ క‌నిపించాడు. అత‌నితో పాటు స్మృతి ఇరానీ కూడా ఆడుకున్న దృశ్యాలు ఉన్నాయి. వీడియోను షేర్ చేస్తూ.. "ఇది నా బిడ్డ పుట్టినరోజు.. రవి... మీరు మీ అమ్మ, మొత్తం కుటుంబానికి  ఆశీర్వాదాలు.. ప్రేమగల, ఉత్సాహపూరితమైన, దయతో.. దేవుడు ఎల్లప్పుడూ మీకు మంచి ఆరోగ్యం, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ... మీ మాసి నిన్ను ఎంతో మిస్ అవుతున్న‌ది. హ్యాపీ బర్త్ డే లవ్" అంటూ స్మృతి ఇరానీ ఆ పోస్టులో రాసుకొచ్చారు. 

 

స్మృతి ఇరానీ పోస్టుపై స్పందించిన ఏక్తా కపూర్ బదులిస్తూ, "శుభాకాంక్షలకు చాలా కృతజ్ఞతలు @smritiiraniofficial మాసి... మిమ్మల్ని మా జీవితంలో కలిగి ఉన్నందుకు మేము చాలా కృతజ్ఞులం !!! మీరే అత్యుత్తమ మాసి!!!" కాగా, అంతకు ముందు ఎక్తా కపూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రవి పుట్టిన రోజు సందర్భంగా సిద్ధి వినాయకుని  ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 

 

కాగా, స్మృతి ఇరానీ, ఏక్తా కపూర్ సన్నిహిత స్నేహితులు. వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు చిత్రాలు, షోల‌లో న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య బ‌ల‌మైన స్నేహం ఏర్ప‌డింది. అప్పుడ‌ప్పుడు ఒక‌రిపై ఒక‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించుకుంటూ ఉంటారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tusshar Kapoor (@tusshark89)

ఇతర నటీనటులు కూడా రవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios