Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో బాలయ్యకు పోటీ ఇవ్వలేకపోతున్న చిరు..!


బాలకృష్ణ-చిరంజీవి తమ లేటెస్ట్ చిత్రాల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. ఆటోమేటిక్ గా పోలికలు, వాదనలు మొదలైపోయాయి. 
 

fan war between balakrishna and chiranjeevi on ugadi updates ksr
Author
First Published Mar 23, 2023, 2:39 PM IST

ఉగాది పురస్కరించుకుని టాలీవుడ్ మేకర్స్ అప్డేట్స్ తో హోరెత్తించారు. వీటిలో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణల చిత్రాల ఫస్ట్ లుక్స్ అందరినీ ఆకర్షించాయి. పండగకు ఒకరోజు ముందే చిరంజీవి భోళా శంకర్ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. తమన్నా-కీర్తి సురేష్ కూర్చొని ఉండగా వెనుక చిరంజీవి నిల్చొని ఉన్నారు. అది భోళా శంకర్ సినిమాలో ఓ వేడుక సన్నివేశానికి సంబంధించిన స్టిల్ అని అర్థం అవుతుంది. అయితే ఈ లుక్ బాగా ట్రోల్ కి గురైంది. ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ యాడ్ లా ఉందంటూ యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేశారు. 

ఆ నెక్స్ట్ డే మార్చి 22న బాలకృష్ణ తన లేటెస్ట్ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కోరమీసం, మెడలో తాయత్తు, కండువాతో మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఓ కార్మిక నాయకుడు లేదా ఉద్యమ నాయకుడిని తలపించేలా ఆ లుక్ ఉంది. దీనికి పాజిటివ్ స్పందన వచ్చింది. బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సాధారణ ప్రేక్షకులు సైతం బాలయ్య లుక్ కేక అంటూ కామెంట్స్ పెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యను పవర్ఫుల్ రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడన్న అభిప్రాయం వెల్లడించారు.

fan war between balakrishna and chiranjeevi on ugadi updates ksr

కాగా బాలయ్య 108, భోళా శంకర్ చిత్రాల ఉగాది అప్డేట్స్ మధ్య ఫ్యాన్ వారు మొదలైంది. చిరంజీవి లుక్ బాగోలేదని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే. బాలయ్య పోస్టర్ లో చిరంజీవి ఫ్యాన్స్ లోపాలు వెతుకుతున్నారు. ఫ్యాన్స్ వాదన పక్కన పెడితే... ఫస్ట్ లుక్ విషయంలో చిరంజీవి మీద బాలయ్యది పై చేయి అయ్యిందని మెజారిటీ వర్గాల అభిప్రాయం. 

అదే సమయంలో చిరంజీవి అభిమానులు ఓ వెర్షన్ తెరపైకి వేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా పోస్టర్స్, లుక్స్ మీద కూడా ఇలానే నెగిటివ్ కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద మా బాస్ దుమ్ముదులిపాడు. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. బాలయ్య చిరంజీవి ముంది నిలబడలేకపోయారని గుర్తు చేస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ మమ్మల్ని ఏం చేయలేవు. అసలు యుద్ధంలో తేల్చుకుంటాం అంటున్నారు. 2023 సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్స్ లో మాత్రం వాల్తేరు వీరయ్యది పైచేయి అయ్యింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios