Asianet News TeluguAsianet News Telugu

సమంత ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ‘యశోద’ నుంచి సాలిడ్ అప్డేట్.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ రానుంది. ఇందుకు మేకర్స్ డేట్, టైం ఫిక్స్ చేస్తూ అనౌన్స్ చేశారు. 

Exciting news for Samantha fans, Solid update from Yashoda Movie!
Author
First Published Aug 31, 2022, 12:55 PM IST

స్టార్ హీరోయిన్ సమంత  (Samantha) నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘యశోద’ (Yashoda) నుంచి అభిమానులకు, ఆడియెన్స్ కు తాజాగా అదిరిపోయే న్యూస్ అందింది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి గతంలో పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ను  రిలీజ్ చేశారు. ఆ తర్వాత మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అందలేదు. ఈ రోజు గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) సందర్భంగా చిత్రం నుంచి సాలిడ్ అనౌన్స్ మెంట్ అందింది. అభిమానులు ఊహించని అప్డేట్ ను అందిస్తూ సర్ ప్రైజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఇంతకీ అప్డేట్ ఏంటంటే.. చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ (Yashoda Teaser) ను రిలీజ్ చేసేందుకు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 5:49కి యూట్యూబ్ లో  వదలనున్నారు. దీంతో ఆడియెన్స్, సమంత అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అప్డేట్ అందిస్తూనే.. ‘యశోద’ చిత్ర యూనిట్  ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. రాబోయే టీజర్ చాలా థ్రిల్లింగ్ ఉంటుందన్నారు. ఇప్పటికే  ఈచిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు నెలకొననున్నాయి.  

ఈ చిత్రానికి హరిశంకర్,  హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో యశోద పాత్రలో సమంత నటిస్తుండగా.. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 12నే రిలీజ్ కావాల్సి ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తర్వలోనే రిలీజ్ డేట్ ను  అనౌన్స్ చేయనున్నారు. 

చివరిగా సమంత ‘పుష్ఫ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో ‘ఊ అంటావా మామా’ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కాగా.. సమంత కూడా తొలిసారిగా ఐటెం సాంగ్ లో నటించడంతో సాంగ్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం నార్త్ లోనే ఈ బ్యూటీ పాగా వేసింది. బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లోనే నటించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక  సామ్ నటించిన ‘యశోద’,‘శాకుంతలం’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios