Asianet News TeluguAsianet News Telugu

కాల్ గర్ల్ గా అయినా కలిసొస్తుందా? బోల్డ్ ఆశలు

 ప్రతీ స్టార్ హీరోయిన్ తన కెరీర్ లో ఇలాంటి పాత్రలు చేస్తూనే వచ్చింది. తాజాగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా కూడా అటే ప్రయాణం పెట్టుకుంది. ఆమె త్వరలో కాల్ గర్ల్ గా కనిపించనుందని సమాచారం.

Eesha Rebba is playing the role of a call girl
Author
Hyderabad, First Published Aug 19, 2020, 8:06 AM IST

 కొన్ని పాత్రలు ఇక కెరీర్ చివరకి వచ్చేసింది అనుకున్నప్పుడు హీరోయిన్స్ ఎంచుకుంటూంటారు. అలాంటి వాటిలో వేశ్య,కాల్ గర్ల్ లాంటివి. ఎందుకంటే అవి ఓ ప్రత్యేకమైన ముద్రను వేస్తాయి. ఎంత గొప్పగా చేసినా పేరు రావచ్చేమో కానీ, ఆఫర్స్ అంత త్వరగా తెచ్చిపెట్టవు. కాకపోతే ప్రతీ స్టార్ హీరోయిన్ తన కెరీర్ లో ఇలాంటి పాత్రలు చేస్తూనే వచ్చింది. తాజాగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా కూడా అటే ప్రయాణం పెట్టుకుంది. ఆమె త్వరలో కాల్ గర్ల్ గా కనిపించనుందని సమాచారం.

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్లోజ్ అశోశియోట్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సీరిస్ లో ఆమె కాల్ గర్ల్ గా కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర అర్బర్ సొసైటిలో తిరిగే వ్యభిచారి అని చెప్తున్నారు. స్క్రిప్టు రాసిన సంపత్ నంది ఆ పాత్రను బాగా తీర్చిదిద్దారట. ఈ పాత్ర కాస్తంత ఎక్కువ బోల్డ్ గానే ఉంటుందని, అయినా ఈషా రెబ్బా తన కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందని నమ్ముతోందిట. ప్రస్తుతానికి టెస్ట్ షూట్ జరిగింది.త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ... ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందీ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించినా తెలుగమ్మాయి (వరంగల్) కావడంతో సరైన బ్రేక్ రాలేదు.

 అయితే నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’, త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో చేసినా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈషా నటనను చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత... ఆమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్ సీరిస్ చేస్తున్నారామె.

Follow Us:
Download App:
  • android
  • ios