Asianet News TeluguAsianet News Telugu

#Dunki:ఇంత తక్కువ బడ్జెట్ ఏంటి సామీ? షాకింగ్

పఠాన్, జవాన్‌ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్‌షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

Dunki is Shah Rukh Khan lowest budgeted film in 6 years jsp
Author
First Published Nov 23, 2023, 6:55 AM IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan)సినిమా అంటే ఆ బడ్జెట్ లెక్కలే వేరు. అందులోనూ పడి లేచిన కెరటం ఆయన. వరసపెట్టి పఠాన్, జవాన్ అంటూ సూపర్ హిట్స్ ఇచ్చారు. వెయ్యి కోట్ల సినిమాలు చేసారు. దాంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు అనగానే ఎక్సపెక్టేషన్స్ ఏ స్దాయిలో ఉంటాయో ఊహించవచ్చు.అందులోనూ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా. ఇంక చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తూంటారు. ఈ విషయం షారూఖ్ కు తెలుసు. అన్ని జాగ్రత్తలూ తీసుకునే సినిమా చేసే ఉంటారని అర్దమవుతోంది.  ఈ క్రమంలో ఈ చిత్రం బడ్జెట్ మాటర్ బయిటకు వచ్చింది. షాక్ ఇచ్చింది.  

బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు దర్శకుడు, హీరో రెమ్యునరేషన్స్ మినహాయిస్తే కేవలం 85 కోట్లలో సినిమా పూర్తైందిట. 75 రోజులలో షూటింగ్ పూర్తైంది. షారూఖ్ పోర్షన్ కేవలం అరవై రోజులు లోపలే పూర్తైందని వినికిడి. పబ్లిసిటీ అన్ని కలిపి 125 కోట్ల లోపే అయ్యిందని సమాచారం. అంత పెద్ద స్టార్ హీరో సినిమా అంత తక్కువలో అవ్వటం బాలీవుడ్ కు పెద్ద షాక్ గా ఉంది.  షారూఖ్, రాజ్ కుమార్ హిరానీ ఇద్దరూ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్ గా ఉంటున్నారు. 

డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ మూవీకి అభిజాత్‌ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్‌ కథనందిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios