Asianet News TeluguAsianet News Telugu

వామ్మో..దిశా పటాని దెబ్బకి నేలకి కరుచుకున్నాడు.. బర్త్ డే గర్ల్ లో దిమ్మతిరిగే ట్యాలెంట్

నేడు దిశా పటాని తన 31వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం దిశా పటాని ప్రస్తుతం దుబాయ్ ఉంది.

Disha Patani mind blowing stunts goes viral in her birthday dtr
Author
First Published Jun 13, 2023, 3:11 PM IST | Last Updated Jun 13, 2023, 3:11 PM IST

దిశా పటాని పూరి జగన్నాథ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

నేడు దిశా పటాని తన 31వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం దిశా పటాని ప్రస్తుతం దుబాయ్ ఉంది. తన స్నేహితులతో కలసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది. గ్లామర్ షోతో మొదలై దిశా పటాని ప్రయాణం క్రమంగా విభిన్నంగా మారింది. గ్లామర్ తో పాటు యాక్షన్ స్టంట్స్ పై కూడా దిశా మక్కువ చూపిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న దృశ్యాలని ఆమె తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

 

బాలీవుడ్ లో హీరోయిన్లు అందాలు ఒలకబోస్తూనే యాక్షన్ సన్నివేశాలు కూడా చేస్తుంటారు. తాను కూడా ఏం తక్కువ కాదని దిశా చెబుతోంది. నేడు దిశా పటాని బర్త్ డే సందర్భంగా ఆమె యాక్షన్ వీడియోల్ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చిరుత పులిలా చెలరేగుతూ కళ్ళు చెదిరే విధంగా దిశా పటాని యాక్షన్ స్టంట్స్ చేస్తోంది. ఆమె దెబ్బకి యాక్షన్ ట్రైనర్ నేలకు కరుచుకున్నాడు. 

నిర్మాతలు, దర్శకులు ఆమె గ్లామర్ మాత్రమే కాదు ఈ ట్యాలెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలని నెటిజన్లు రిక్వస్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాని వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తోంది. యోధా, కంగువ, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో దిశా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాలన్నీ యాక్షన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. 

దిశా పటాని లవ్ ఎఫైర్స్ కూడా బాలీవుడ్ లో హాట్ టాపిక్కే. దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అలెగ్జాండర్ అనే వ్యక్తితో దిశా ప్రస్తుతం ప్రేమలో ఉంది.

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios