Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీతో మజాకానా.. యాంకర్‌ను బికినీలో చూడాలనుందన్న వర్మ

తాజాగా నేక్డ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. ఆ ఇంటర్వ్యూలోనూ తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా యాంకర్‌ ని బికినీలో చూడాలనుందంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్‌ వర్మను.. మీకు ఏ అమ్మాయినైనా చూస్తే వావ్‌ అన్న ఫీలింగ్ కలిగిందా అని అడిగింది.

Director Ram Gopal Varma praises Anchor in Naked Movie latest interview
Author
Hyderabad, First Published Jun 26, 2020, 1:21 PM IST

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ అంతా షట్‌ డౌన్‌ అయితే రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లో క్లైమాక్స్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన వర్మ, ఈ నెల 27న నేక్డ్‌ పేరుతో మరో మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వర్మ. అయితే ఆ ఇంటర్వ్యూలలోనూ తన మార్క్‌ చూపిస్తూ తన సినిమాలకు కావల్సినంత ప్రమోషన్‌ రాబట్టుకోవటంలో వర్మ స్టైలే వేరు.

తాజాగా నేక్డ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. ఆ ఇంటర్వ్యూలోనూ తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా యాంకర్‌ ని బికినీలో చూడాలనుందంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్‌ వర్మను.. మీకు ఏ అమ్మాయినైనా చూస్తే వావ్‌ అన్న ఫీలింగ్ కలిగిందా అని అడిగింది. అయితే వెంటనే వర్మ ఏ మాత్రం తడుముకోకుండా చాలా మందిని చూస్తే ఆ ఫీలింగ్‌ కలిగింది. ఆ చాలా మందిలో నువ్వు కూడా ఉన్నావ్‌ అంటూ రిప్లై ఇచ్చాడు.

వర్మ మాటలతో సిగ్గుపడిన యాంకర్‌ తరువాత.. `కోరికలు మనుషులకు చాలా కామన్‌.. అలా మీకు తీర్చుకోలేకపోయిన క్రేజీ కోరికలు ఏమైన ఉన్నాయా` అని అడిగింది. దీనికి కూడా వర్మ క్రేజీగా రిప్లై ఇచ్చాడు. నాకు కలిగిన కోరికల నేను తీర్చుకోకుండా ఉన్న సందర్భాలు లేవు అనిచెప్పాడు. అదే సమయంలో నాకు ఓ కోరిక కలిగి అది తీరదని అనిపిస్తే నేను వెంటనే ఆ కోరికను మర్చిపోతా అని చెప్పాడు. దానికి కొనసాగింపుగా `నాకు ఇప్పుడు నిన్ను (యాంకర్‌ను) బికినీలో చూడాలన్న కోరిక ఉంది. నేను నీకు ఇప్పుడు అలాంటి ఓ ఆఫర్‌ ఇస్తా.. నువ్వు ఒప్పుకుంటే ఓకే.. నో చెప్తే వెంటనే నేను ఆ విషయాన్ని మర్చిపోతా` అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ యాంకర్ షాక్‌ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios