Asianet News TeluguAsianet News Telugu

#Bimbisara:‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు వివరణ !

బింబిసార సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏలోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి. కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. 

 Dil Raju about #Bimbisara OTT release
Author
Hyderabad, First Published Aug 8, 2022, 4:17 PM IST


గత కొంతకాలంగా  సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు రావడం జరిగిన సంగతి తెలసిందే.  మొదట్లో  ఓటిటి అంటే చిన్నాచితక అది కూడా వెబ్ సిరీస్ వంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఎప్పుడైతే కోవిడ్  ఎంట్రీ ఇవ్వటం జరిగిందో పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యింది. ఈ ఇంపాక్ట్ డైరక్ట్ గా సినిమాలపై పడింది. దానికి తోడు టిక్కెట్ సమస్యలు వంటి వాటి వలన ప్రారంభంలో అనేక సినిమాలు థియేటర్ లో రిలీజ్ కావలసినవి ఓటిటిలో విడుదల చేయడం జరిగింది.

 క్రేజ్ ఉన్న హీరోలు మాత్రమే ప్రారంభంలో ఓటిటికి సై అన్నారు.  కానీ రాను రాను పరిస్థితి మారడంతో పాటు సినిమా థియేటర్ లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటి కి వచ్చేయడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమా ధియేటర్ల యాజమాన్యం చాలా నష్టాలు చూసే పరిస్థితి ఇటీవల నెలకొంది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా.. తక్కువ టైంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. 

సినిమా ఏమాత్రం ఫ్లాప్ అయితే రెండు వారాల లోపే ఓటిటి లోకి ప్రత్యక్షమవుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోతున్నారు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే వాటి అమలు ఎలా ఉంటుందనేది అందురూ ఎదురు చూస్తున్న అంశం. ఈ నేపధ్యంలో ఈ వారం రెండు సినిమాలు హిట్ అయ్యాయి. వాటి ఓటిటి రిలీజ్ పై అందరి దృష్టీ ఉంది. ఈ విషయమై ఈ రోజు క్లారిటీ వచ్చింది.

మొదటగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. బింబిసార సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ’50 రోజుల తర్వాత మాత్రమే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ విషయమై నిర్మాత హరికృష్ణతో మాట్లాడానని దిల్ రాజు చెప్పారు.

మరో ప్రక్క బింబిసార సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏలోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి. కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌  హీరోయిన్స్ గా నటించారు. మొత్తానికి ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios