Asianet News TeluguAsianet News Telugu

పవన్ తో బండ్ల గణేష్ కి చెడిందా... ఈ జన్మకు లేదంటూ ట్వీట్ తో క్లారిటీ!

త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టడంతో పవన్ కళ్యాణ్ బాగా హర్ట్ అయ్యారని, బండ్ల గణేష్ ని దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. ఈ  వాదనకు బలం చేకూర్చుతూ పవన్-బండ్ల గణేష్ మళ్ళీ కలవలేదు.

differences with hero pawan kalyan here bandla ganesh clarifies
Author
First Published Feb 8, 2023, 8:49 PM IST

పవన్ కళ్యాణ్ తన భక్తుడు బండ్ల గణేష్ ని దూరం పెట్టారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్ కి  ఆహ్వానం అందలేదు. దానికి దర్శకుడు  త్రివిక్రమ్ కారణం అంటూ బండ్ల గణేష్ ఫోన్లో అనుచిత కామెంట్స్ చేశారు. ఆ ఆడియో ఫైల్ బయటకు  రావడంతో వివాదం చెలరేగింది. వైరల్ అవుతున్న ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత అది నా వాయిస్సే, కోపంలో ఓ మాట అన్నాను. అంత మాత్రాన మా స్నేహం చెడిపోతుందా? కలిసి సారీ చెప్పానంటూ వెల్లడించారు. 

త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టడంతో పవన్ కళ్యాణ్ బాగా హర్ట్ అయ్యారని, బండ్ల గణేష్ ని దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. ఈ  వాదనకు బలం చేకూర్చుతూ పవన్-బండ్ల గణేష్ మళ్ళీ కలవలేదు. అప్పుడప్పుడు బండ్ల గణేష్ చేసే నెగిటివ్ సోషల్ మీడియా కామెంట్స్ పవన్ కళ్యాణ్ గురించే అని పలువురి భావన. అలాగే ఈ మధ్య పవన్ ని పొగిడే కార్యక్రమం తగ్గించి ఎక్కువగా రవితేజ నామస్మరణ చేస్తున్నాడు. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ వేదికగా బండ్ల గణేష్ పై ఓ కామెంట్ చేశాడు. గబ్బర్ సింగ్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అని హోస్ట్ బాలయ్య అడిగారు. 'నేను అనుకున్నంత ఇవ్వలేదు కాని తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు' అని పవన్ చెప్పాడు. దీంతో గబ్బర్ సింగ్ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ పవన్ కి పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. 

ఈ సంఘటనను ఉద్దేశిస్తూ ఓ నెటిజెన్... మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడని పూజిస్తారు. ఆయన మాత్రం పబ్లిక్ షోలో గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడి మీ పరువు తీసేశారు, అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ ట్యాగ్ చేస్తూ 'నా విశ్వరూపం చూపిస్తా ' అని బండ్ల గణేష్ కామెంట్ పెట్టాడు. బండ్ల ట్వీట్...  నా పరువు తీసిన పవన్ కళ్యాణ్ కి ఇకపై నేనేమిటో చూపిస్తా... అని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

పవన్ కు బండ్ల గణేష్ వార్నింగ్ అంటూ ఓ మీడియా సంస్థ థంబ్ నైల్ పెట్టగా... దానిపై బండ్ల గణేష్ స్పందించారు. అది ఎప్పటికీ జరగదు. పవన్ కళ్యాణ్ నాకు దైవ సమానులు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అసలు బండ్ల గణేష్ మనోగతం ఏమిటో అర్థం కావడం లేదు. కొన్నాళ్లుగా పవన్ అభిమానులు సైతం బండ్ల గణేష్ కి యాంటీ కామెంట్స్ చేయడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios