Asianet News TeluguAsianet News Telugu

Dhanush: సార్ సినిమా షూటింగ్ కు బ్రేక్.. ధనుష్ ఆరోగ్యం బాగోలేకనేనా..?

వెంకీ అట్లూరి(Venkky Atluri) డైరెక్షన్ లో టాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) . సార్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి.. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సడెన్ గా ధనుష్ ఆరోగ్యం బాగోలేక షూటింగ్ కు బ్రేక్ పడినట్టు సమాచారం.

Dhanush Sir Movie Shooting Postpone
Author
Hyderabad, First Published Jan 25, 2022, 1:35 PM IST

వెంకీ అట్లూరి(Venkky Atluri) డైరెక్షన్ లో టాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) . సార్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి.. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సడెన్ గా ధనుష్ ఆరోగ్యం బాగోలేక షూటింగ్ కు బ్రేక్ పడినట్టు సమాచారం.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ముందుగా డైరెక్ట్ తెలుగు మూవీ అనౌన్స్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush). కాని ముందుగా వెంకీ అట్లూరి(Venkky Atluri) తో సినిమా స్టార్ట్ చేశాడు. సార్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈమూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో ఇంపార్టెంట్ షూట్ జరుగుతున్న టైమ్ లో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ధనుష్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారట.

రీసెంట్ గా ధనుష్(Dhanush)  అన్న.. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కోవిడ్ బారిన పడ్డారు. జాగ్రత్తగా ఉండాలంటూ మెసేజ్ కూడా చేశారు రాఘవ. ఇక గత కొద్ది రోజులుగా ధనుష్ కూడా డల్ గా ఉండటం. చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం జరుగుతుందట. దాంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ధనుష్ కు కూడా కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో షూటింగ్ కు బ్రేక్ పడినట్టు సమాచారం.

వెంటనే ధనుష్(Dhanush)  ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దాంతో పాటు సెట్ లో తన తో క్లోజ్ గా ఉన్న అందరూ.. టెస్ట్ చేయించుకోవాలని ధనుష్ సూచించినట్టు సమాచారం. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో ఎక్కువగా ధనుష్ కు సంబంధించిన సీన్స్ ను మాత్రమే షూట్ చేస్తున్నారు. అటువంటి టైమ్ లో ఇలా జరగడంతో షూటింగ్ షెడ్యూల్ డిస్ట్రబ్ అయిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన తరువాత షూటింగ్ ను పది రోజులు తరువాత అప్పటి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

రీసెంట్ గా తాను తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు ధనుష్(Dhanush). సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతరు ఐశ్వర్యను 18 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఇన్నేళ్ల తరువాత వీరు విడిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పాన్ ఇందియా సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు ధనుష్. తెలుగునుంచే రెండు పాన్ ఇండియా సినమాలు చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios