బిచ్చగాడు, బేతాళుడు సక్సెస్ తో విజయ్ ఆంటోనీకి యమా క్రేజ్ విజయ్ ఆంటోని తదుపరి చిత్రం యెమెన్ కు క్రేజీ బిజినెస్

" భేతాళుడు" విజయం త‌ర్వాత విజ‌య్ ఆంటోని న‌టిస్తున్న `యెమెన్‌` చిత్రానికి ఇప్పుడు ఎక్కడా లేని క్రేజు నెల‌కొంది. ప్ర‌స్తుతం 2.0 (రోబో2) చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ విజయ్ ఆంథోని హీరోగా ఈ సినిమాను నిర్మిస్తుండ‌టంతో పాటు, భేతాళుడు సినిమాకు విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావటంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టు కుంది.

తొలి నాలుగు రోజుల్లోనే "భేతాళుడు " లాభాల బాట పట్టడం తో త‌ర్వాత వస్తొన్న "యెమెన్ " పై ఇప్పుడు పంపిణిదారుల కన్ను పడింది. తమిళ్ తో పాటు తెలుగులో సైతం స్ట్రెయిట్ హీరోకి ఏమాత్రం తీసిపోని క్రేజున్న హీరోగా త‌న‌ని తాను ప్రమోట్ చెసుకొవటంలో సక్సెస్ అయ్యాడు విజ‌య్ ఆంటోని. అందుకే ఇప్పుడు యెమన్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్స్ తో ఏరియా వైస్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది .

"బేతాళుడు " తెలుగు రైట్స్ కంటే యెమన్ కు రెండు రెట్లు ఎక్కువ చెల్లించి మరీ సినిమాను దక్కించుకునెందుకు పలువురు అగ్ర నిర్మాతలు పోటీ పడ్డారు.. ఫైనల్ గా ఎవ్వరు ఊహించని రేట్ కు ఈ చిత్రం తెలుగు హక్కులకు ఓ యువ నిర్మాత దక్కించుకున్నారు. "భేతాళుడు" విజయంతో ఇప్పుడా నిర్మాత సంతోషంతో ఉన్నారట.