Asianet News TeluguAsianet News Telugu

చిరు చిందేస్తే.. టాలీవుడ్ ఊగిపోతుందా..

చిరు 150వ చిత్రానికి  సంబంధించిన రోజుకో అప్ డేట్ అభిమానులకు నిద్రపట్టనీయడం లేదు.8 ఏళ్లుగా మెగా స్టెప్పుల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు 150 వ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ రెడీ చేస్తున్నారు.ఇప్పుటికే లారెన్స్ కంపోజీషన్ లో అద్దిరిపోయే సాంగ్ ను కంప్లీట్ చేసారు. లక్ష్మీరాయ్ ఈ పాటలో మెరిసింది. ఇప్పుడు సినిమాకు సంబంధించి మరో రెండు పాటల కోసం ఈరోప్ పెళ్లారు ఖైధీ నెంబర్ 150 చిత్ర యూనిట్ వారు.

CHIRU RE ENTRY DANCE CRAZE IN TOLLY WOOD

మెగా స్టార్ చిరంజీవికి సినిమాల్లో దాదాపు 8 ఏళ్ల గ్యాప్. మరో నటుడికైతే కెరీర్ ఖతం అవుతుంది. కానీ మెగాస్టార్ పరిస్థితి వేరు. ఆయన రాక కోసం ఈ ఎనిమిదేళ్లలో .. ప్రతిరోజు ప్రతినిముషం ఎదురుచూసారు ఫ్యాన్స్. బ్రూస్ లీ గెస్ట్ అప్పీయరెన్స్ క్లిక్ అయ్యి ఉంటే.. టాలీవుడ్ లో మెగా జోర్ మరో విధంగా ఉండేది. బ్రూస్ లీ ఫ్లాప్ అయ్యేసరికి..మెగా స్టార్ గెస్ట్ లుక్ నిరాశపర్చింది. అందుకే తన సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు.. మెగా స్టార్ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు. ఈవెంట్స్ లో డ్యాన్సులు చేసి తనలో సత్తా ఏంటో చూపించాడు.

 

కోలీవుడ్ కత్తికి అఫీసియల్  రీమేక్ గా తెరకెక్కుతున్న ఖైధీనెంబర్ 150 చిత్రానికి దేవీ స్వరాలు సమకూర్చుతున్నాడు. శంకర్ దాదా సీరిస్ చిత్రాల తర్వాత వీరిద్దరు కలసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios