Asianet News TeluguAsianet News Telugu

ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి...అదిరిపోయే ఫన్

అందుతన్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్  ఫన్ డ్రామా అని,  చిరంజీవి ఈ చిత్రంలో ప్రొఫెసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.

Chiranjeevi will be seen as a professor in the film as per the gossip
Author
First Published Jan 28, 2023, 2:57 PM IST


మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాడు . చూస్తూంటే  ఎక్కడా కొంచెం కూడా  స్పీడ్ తగ్గించే మూడ్ లో లేడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న తీరు ఆయనను మరోసారి బాక్సాఫీస్ కి రారాజుగా నిలబెట్టింది. అతని తాజా చిత్రం వాల్టేర్ వీరయ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్క్‌ను దాటి రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. రిలీజైన ఇన్ని రోజులు తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. అయితే ఓ ప్రక్క చిరంజవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మెహర్ రమేష్ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రం భోలా శంకర్ షూటింగ్  కు వెళ్లిపోతున్నారు. చిరంజీవి జోష్ ని చూసిన చాలా మంది దర్శకుడులు ఆయన దగ్గరకు వెళ్తున్నారు.

అయితే భోళా శంకర్ సినిమా  తర్వాత ఆయన ఇంకా ఏ ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు చిరంజీవి.  ఈ క్రమంలో వెంకీ కుడుముల మరో సారి చిరంజీవి ఎప్రోచ్ అయ్యినట్లు సమాచారం. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల  తో చిరంజీవి ఓ సినిమా చేయనున్నాడని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయబడింది కానీ చిరంజీవి భారీ మార్పులు కోరడంతో ఆ ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లింది.ఈ లోగా  చిరంజీవి గాడ్ ఫాదర్ తో బిజీ అయ్యాడు.

ఇప్పుడు, వెంకీ కుడుముల స్క్రిప్ట్‌లో ఆ  మార్పులు చేసి, మరోసారి చిరంజీవిని సంప్రదించడంతో అదే ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందని ఎక్సక్లూజివ్ సమాచారం. మెగాస్టార్ కొత్త వెర్షన్‌ను ఇష్టపడి, ఈ యంగ్ డైరక్టర్ కు ఓకే చెప్పినట్లు  తెలుస్తోంది. మరో ప్రక్క చిరంజీవి మరికొంత మంది దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారో  చూడాలి.

మరో ప్రక్క దర్శకుడుగా వెంకీ కుడుములకి ఇది పెద్ద ఆఫర్, ఎందుకంటే చిరంజీవిని తన మూడవ చిత్రంలో డైరెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందుతన్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్  ఫన్ డ్రామా అని,  చిరంజీవి ఈ చిత్రంలో ప్రొఫెసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతానికి, డైరక్టర్  తన మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా లైన్ లో పెడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios