బిగ్‌బి.. ఇండియన్‌ తెరపై మరొకరు భర్తీ చేయలేని పేరు. అది ఆయనకు మాత్రమే సూట్‌ అయ్యే పేరు.  బాలీవుడ్‌నే కాదు, ఇండియన్‌ తెరని ఐదు దశాబ్దాలుగా ఏలుతున్న పేరు. ఆయనే అమితాబ్‌ బచ్చన్‌. వీడు హీరో ఏంటీ అనే స్టేజ్‌ నుంచి తిరుగులేని సూపర్‌ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగిన అమితాబ్‌ బచ్చన్‌ నేడు(ఆదివారం)తన 78వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్‌. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వంటి ప్రముఖులు బిగ్ బికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు ఆయన మార్గనిర్దేశకుడని, ఆయన తనని ఎప్పుడూ ఇన్‌స్పైర్‌ చేస్తారని చిరు, మహేష్‌, చెర్రి, ప్రభాస్‌ అన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Many many happy returns of the day to the legendary @amitabhbachchan sir. Thank you for inspiring us all!

A post shared by Prabhas (@actorprabhas) on Oct 10, 2020 at 9:29pm PDT

బిగ్‌బాస్‌ తెలుగులో `మనం`తోపాటు చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి`లో గురువు గోసాయి వెంకన్నగా నటించారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో కీలక పాత్రకి ఎంపికయ్యారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది.