Asianet News TeluguAsianet News Telugu

వైరల్ అవుతున్న సోనూ సూద్ స్టైలిష్ జాకెట్, కాస్ట్ ఎంతో తెలుసా..?

ఆమధ్య రామ్ చరణ్ ఇంట్లో వేసుకునే చెప్పులు ధర 55 వేలు అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. రీసెంట్ గా ఎన్టీఆర్ ధమ్కీ ప్రీ రిలీజ్ కు వేసుకున్న హుడీ కూడా వైరల్ అయ్యింది. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్.. రియల్ హీరో సోనుసూద్ కు సంబంధించిన జాకెట్ ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇంతకీ ఆ జాకెట్ కాస్ట్ ఎంతో తెలుసా..? 

Bollywood Star Sonu Sood Stylish Jacket Cost Viral In Social Media
Author
First Published Mar 22, 2023, 1:22 PM IST


సెలబ్రిటీలు వాడే వస్తువులపై ఎప్పటికప్పుడు నజర్ ఉంటుంది. వాళ్లు ఏం వాడుతున్నారా..? అవి ఎంత కాస్ట్ ఉన్నాయా ..? బ్రాండ్ ఏంటీ..? ఇలా అనేక రకాలుగా నెటిజన్లు ఆరా తీస్తారు. ఆరా తీయ్యడంతోనే ఆగదు.. వాటిని వైరల్ చేసే పని కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇవే కాదు వాళ్లు ఉండే ఇల్లు.. వాళ్లు వాడే  లగ్జరీ కార్స్, రెమ్యునరేషన్స్..కాట్ట్యూమ్స్, జువ్వెల్లరీ.. వాచెస్.. ఆకరికి స్టార్స్ వాడే షూస్, చెప్పులు కూడా వైరల్ అయిన రోజులు ఉన్నాయి. వాటి కాస్ట్ కనుక్కోవడం.. వాటిని వైరల్ చేయడం ఇదే పని కొంత మందికి. ఆమధ్య రామ్ చరణ్ ఇంట్లో వేసుకునే చెప్పులు ధర 55 వేలు అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. రీసెంట్ గా ఎన్టీఆర్ ధమ్కీ ప్రీ రిలీజ్ కు వేసుకున్న హుడీ కూడా వైరల్ అయ్యింది. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్.. రియల్ హీరో సోనుసూద్ కు సంబంధించిన జాకెట్ ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

రియల్ హీరో సోనూ సూద్ స్టైలిష్ జాకెట్ రేట్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.. ఇక సోనూ సూద్ వేసుకున్న జాకెట్ ను చూసిన నెటిజన్లు దానికి సబంధించిన బ్రాండ్, కాస్ట్ వివరాలు సెర్చ్ చేశారు. అంతే కాదు వాటిని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.  Dolce & Gabbana – Logo Panel Bomber కంపెనీకి చెందిన  Jacket కాస్ట్ ఆన్ లైన్ లో 1 వెయ్యి... 345 డాలర్లు ఉంది. అనగా మన కరెన్సీలో దాదాపు గా 1 లక్ష, 11 వేల 142 రూపాయలు ఉంది.  చూడ్డానికి కాస్త  సింపుల్‌గా  అనిపించినా.. ఈ జాకెట్‌లో సోనూసూద్ రీయల్ గానే కాదు.. రీల్ లైఫ్ లో కూడా హీరోల స్టైలిష్‌గా ఉన్నారు.

సోనూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్‌కి .. సినిమాల్లో విలన్‌గా కనిపించినా.. ఆయన రియల్ లైఫ్‌లో హీరో.. హీరో మాత్రమే కాదు.. కొంత మంది లైఫ్ లో ఆయన దేవుడు.  కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా.. వేల మందికి సాయం చేసిన ఆయన.. ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించారు.  రియల్ హీరో అనిపించుకున్నారు..ప్రజలను సొంత గ్రామాలకు పంపడం, ఆక్సిజన్ సిలిండర్లు పంచడం, ఉద్యోగావకాశాలు కల్పించడం, విలువైన వైద్య సదుపాయాలు.. ఇలా చాలా రకాలుగా సాయం చేసిన సోనూసూద్. ఆరువాత కూడా చాలా మందిని చదివించడం.. వారికి పని కల్పించడం, డబ్బు సాయంలాంటివి చాలా చేశారు. 

ఇక చాలా మంది జీవితాల్లో వెలుగు నింపిని ఆయనను దేవుడి కొలిచారు, విగ్రహాలు పెట్టారు. పాలాభిశేఖాలు చేశారు. దేవుడిలా కొలిచారు. సోనూసూద్ మీద ఇంత అభిమానం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన ఈ సాయం చేయడం కోసం ఎవరిమీద ఆధారపడలేదు. ఎవరి మీదా ఆధారపడలేదు. విరాళం అడగలేదు, ప్రభుత్వాన్ని కోరలేదు.  తన సొంత డబ్బుతో.. ఉన్న ఆస్తులు అమ్మి మరీ సహాయ సహకారాలు అందించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. దాంతో ప్రజలు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే..  రియల్ హీరో సోనూ సూద్.. కరోనా తర్వాత ఆచార్య విలన్ గా నటించాడు. ఆతరువాత ఆయనకు టాలీవుడ్ లో సినిమాలు లేవు. హిందీలో మాత్రం కొన్ని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా మారిన సోనూసూద్   హిందీలో  ఫతే అనే ఫిలింలో నటిస్తున్నారు..


 

Follow Us:
Download App:
  • android
  • ios