Asianet News TeluguAsianet News Telugu

విజయ్ క్రేజ్ ను చూసి షాక్ లో బాలీవుడ్, రౌడీ హీరో కోసం భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో మామూలుగా లేదు. విజయ్ ఎక్కడికి వెళ్ళినా.. బ్రహ్మరథం పడుతున్నారు ఆడయిన్స్. రీసెంట్ గా ప్రమోషన్ ఈవెంట్స్ లో అది కూడా నార్త్ లో విజయ్ క్రేజ్ చూసి.. బాలీవుడ్ బిత్తరపోతోంది. 

Bollywood Shock about Vijay Devarakonda Craze
Author
Hyderabad, First Published Aug 8, 2022, 3:41 PM IST

టాలీవుడ్ లో రౌడీ హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇక పాన్ ఇండియా లెవల్లో విజయ్ మొదటి సారి  హీరోగా నటించిన తాజా సినిమా.. లైగర్.   బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈసినిమాను మాస్ డైరెక్టర్ రి జగన్నాథ్‌ రూపొందించాడు. ఈనెల 25వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. 

గతంలో తెలుగు డబ్బింగ్ సినిమాలతోనే బాలీవుడ్ లో విజయ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు లైగర్ రిలీజ్ అవ్వకముందే విజయ్ క్రేజ్ అమాంతం పెరిగి పోతోంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన  టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్, అనన్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో విజయ్ మాస్ డైలాగ్స్ కు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు ఆడియన్స్. 

 ఈమూవీ ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కు చాలా తక్కువ టైమ్ ఉండటంతో ప్రమోషన్స్కు పదును పెట్టారు టీమ్. విజయ్ డిఫరెంట్ గా..  తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటిదాకా ముంబై, పూణెలో ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు సందడి చేశారు. ముంబైలోనే కాకుండా నార్త్ లోనూ ఇతర నగరాల్లోనూ లైగర్ మూబీ బజ్ ట్రెండ్ అవుతోంది. 

గతంలో ఇతర రాష్ట్రాలు, నగరాల్లో ఏ తెలుగు సినిమాకు ప్రమోషన్లు జరగలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు తప్ప. ఆ సినిమాల తరువాత ఇతర రాష్ట్రాలు అవి కూడా నార్త్ స్టేట్స్ లో విజయ్ ప్రమోషన్స్ లతో అదరగొడుతున్నారు. ముఖ్యంగా విజయ్, అనన్యను ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఒక మాల్ లో జరిగిన ఈవెంట్లో విజయ్, అనన్యలను చూసేందుకు ఫ్యాన్స్  వేలాదిగా ఎగబడ్డారు. 

 

విజయ్ టీమ్ రావడంతో  మాల్ మొత్తం జనసంద్రంగా మారిపోయింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరుస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి.  అయితే ఈ రాష్ట్రాల్లో బాలీవుడ్ సినిమాలకు , బాలీవుడ్ హీరోలకు మాత్రమే క్రేజ్ ఉంటుంది. మిగతావాళ్లను అస్సలు చూడరు. అటువంటిది విజయ్ కు ఈరేంజ్ లో రెస్పాన్స్ రావడంతో.. తెలుగు హీరోకు వస్తున్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ బడా హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios