మంగళవారం కెప్టెన్సీ టాస్క్ లో సభ్యులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని బిగ్‌బాస్‌ ఫైర్‌ అయ్యాడు. సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కెప్టెన్సీ టాస్క్ నే రద్దు చేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం వ్యక్తిగతంగా ఆడాలని పరోక్షంగా సందేశమిచ్చాడు. ఎవరికీ నెక్ట్స్ వీక్‌ ఇమ్యూనిటీ అవసరం లేనట్టుందని ఫైర్‌ అయ్యాడు. దీంతో హౌజ్‌ ఒక్కసారిగా హీటెక్కింది. సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ మధ్య వార్‌ ప్రారంభమైంది. 

ముఖ్యంగా అఖిల్‌ చాలా సీరియస్‌ అయ్యాడు. ఒకరిమధ్య ఒకరికి స్నేహం లేదని, ఇక్కడ ఎలాంటి రిలేషన్‌ లేదన్నారు. అవన్నీ ఉత్తదే అని, వంటి మాటలే అని, అందరు నటిస్తున్నారని తన ఫ్రస్టేషన్‌ వెళ్లగక్కాడు. మోనాల్‌ని కూడా వాయించాడు. తను బాగా మాట్లాడుతుంది తప్పితే, ఏనాడు తనకు గేమ్‌లో సపోర్ట్ చేయలేదని అన్నాడు. సోహైల్‌, మెహబూబ్‌ ఎప్పుడూ వీరిద్దే గేమ్‌ ఆడుకుంటారని, తనకు విలువ ఇవ్వలేదన్నారు. ఈ ఫ్రెండ్‌షిప్‌, రిలేషన్‌ అన్నీ వేస్ట్ అని, అవి మానేయాలని ఫైర్‌ అయ్యారు. సోహైల్‌ సైతం తన దైన స్టయిల్‌లో తన కోపాన్ని వెళ్లగక్కాడు. 

ఎపిసోడ్‌ చివర్లో బిగ్‌బాస్‌ భారీ షాక్‌ ఇచ్చాడు ఇంటి సభ్యులకు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సభ్యులను నిద్ర లేపి స్టోర్‌ రూమ్‌లో ఉన్న సూట్‌కేసులు తీసుకుని తమ వస్తువులన్నింటినీ అందులో సర్దుకొని బయటకు రావాలని చెప్పాడు. దీంతో అందరు తమ వస్తువులు సర్దుకుని బయటకు వచ్చారు. మరి బిగ్‌బాస్‌ రేపు ఎలాంటి ట్విస్ట్ రివీల్‌ చేయబోతున్నాడనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.