గన్ను పట్టిన సమంత... కొత్త మూవీ టైటిల్ పోస్టర్ చూశారా?
సమంత గన్ను పట్టింది. వీరనారిగా పోరాటానికి దిగింది. సమంత కొత్త సినిమా పోస్టర్ కిక్ ఇచ్చేదిగా ఉంది. వైరల్ గా మారింది.
సమంత జన్మదినం నేడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత 37వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన కొత్త మూవీపై అధికారిక ప్రకటన చేసింది. యాక్టింగ్ నుండి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న సమంత నయా ప్రాజెక్ట్ ప్రకటించింది. టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రం టైటిల్ 'మా ఇంటి బంగారం'. సమంత లుక్ ఆసక్తి రేపుతోంది. ఎర్ర చీర కట్టి, నుదుటున బొట్టు పెట్టి, చేతిలో తుపాకీతో వీరనారిగా ఆమె కనిపించారు.
చూస్తుంటే మా ఇంటి బంగారం లేడీ ఓరియెంటెడ్ పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామాగా అనిపిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా కూడా మారారు. ట్రాలాల మూవింగ్ పిక్టర్స్ పేరుతో సమంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం మా ఇంటి బంగారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమంత కెరీర్ పరిశీలిస్తే 2010లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. చెన్నైలో పుట్టి పెరిగిన సమంత మధ్య తరగతికి చెందిన అమ్మాయి. ఎలాంటి సినిమా నేపథ్యం లేకున్నా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏమాయ చేసావే ఆమె డెబ్యూ మూవీ. ఇది సూపర్ హిట్ కొట్టింది. బృందావనం, దూకుడు వంటి బ్లాక్ బస్టర్స్ తో సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. సమంతకు హిట్ పర్సెంటేజ్ ఎక్కువ. లక్కీ హీరోయిన్ గా పరిశ్రమలో ఆమె స్థిరపడింది.
ఓ బేబీ, యూ టర్న్, శాకుంతలం ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు. ఓ బేబీ భారీ విజయం అందుకుంది. సౌత్ ఇండియా లో స్టార్డం అనుభవిస్తున్న సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నార్త్ లో కూడా సత్తా చాటింది. ప్రైమ్ లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 విశేష ఆదరణ దక్కించుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరోసారి హనీ బన్నీ టైటిల్ తో యాక్షన్ సిరీస్ చేసింది. త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. హీరో నాగ చైతన్యను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు ఇచ్చిన విడిపోయింది.