Asianet News TeluguAsianet News Telugu

అయోమయంలో బాలయ్య 'రైతు' సినిమా

  • 'రైతు' మూవీ క్లైమాక్స్ సీన్ పై అయోమయం
  • క్లైమాక్స్ నచ్చక సినిమా షూటింగ్ పెండింగ్ లో పెట్టిన బాలకృష్ణ
  • కృష్ణవంశీతో మంచి క్లైమాక్స్ రూపొందించాలన్న బాలయ్య
balakrishna stop shooting for rythu

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న ప్రెస్టిజియ‌స్ మూవీ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. డిసెంబ‌ర్‌లో బాల‌య్య, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 101వ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కృష్ణ‌వంశీ  'రైతు'కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బి అమితాబ్‌ను కూడా క‌లిశాడు. అంతా ఓకే అనుకుంటున్న నేప‌థ్యంలో 'రైతు' ఫైన‌ల్ స్క్రిప్ట్ బాల‌కృష్ణ‌కు న‌చ్చ‌లేద‌ని, అందువ‌ల్ల సినిమాను త‌ర్వాత చేద్దామ‌ని కృష్ణ‌వంశీతో అన్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. ప్ర‌స్తుతం బాల‌య్య కొత్త స్క్రిప్ట్ వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios