Asianet News TeluguAsianet News Telugu

Balakrishna: అంతకు మించి అంటున్న బాలకృష్ణ.. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం రంగంలోకి బాలయ్య..

అఖండ సినిమా హిట్ జోష్ లో ఉన్నారు నటసింహం బాలయ్య బాబు(Balakrishna).తగ్గేదే లే అంటున్నాడు. అఖండ సక్సెస్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తన్న బాలకృష్ణ(Balakrishna) తన నెక్ట్స్ సినిమాకు అంతకు మించి యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు.  

Balakrishna Next Movie Shooting Action Schedule
Author
Hyderabad, First Published Jan 25, 2022, 11:49 AM IST

అఖండ సినిమా హిట్ జోష్ లో ఉన్నారు నటసింహం బాలయ్య బాబు(Balakrishna).తగ్గేదే లే అంటున్నాడు. అఖండ సక్సెస్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తన్న బాలకృష్ణ(Balakrishna) తన నెక్ట్స్ సినిమాకు అంతకు మించి యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు.  

బాలయ్య బాబు(Balakrishna)  దూకుడు మీద ఉన్నాడు.అఖండ(Akhanda) సినిమా ఇచ్చిన జోష్ తో అన్ స్టాపబుల్ అంటూ అదరగొట్టబోతున్నాడు. బోయపాటితో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. యాక్షన్ సీక్వెన్స్ లతో మెస్మరైజ్ చేశాడు. ఈసారి అంతకుమించిన యాక్షన్ తో ప్యాన్స్ కు భారీ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ(Balakrishna)  . థియేటర్లలో దడదడలాడించి.. రీసెంట్ గా ఓటీటీ చేరిన అఖండ(Akhanda).. ఇంకా తన దూకుడు చూపుతూనే ఉంది.

ఈ సినిమా తన ప్రభాంజనం చూపిస్తుండగానే.. ఆ తరువాత  గోపీచంద్ మలినేని(Gopichand) సినిమా కోసం రెడీ అయ్యారు బాలయ్య(Balakrishna). అఖండ వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో  పెరిగాయి. అందువలన ఆయన స్క్రిప్ట్ పై మరింతగా కసరత్తు చేసి రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.  నిజానికి ఈ నెల 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావల్సి ఉంది కాని  కరోనా ఎఫక్ట్ కారణంగా ఆలస్యమైంది. దీంతో వచ్చేనెల 12వ తేదీ నుంచి  షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.

దీని కోసం ఏర్పట్లు చకచకా జరిగిపోతుననాయి.  హైదరాబాద్  రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ ను ప్లా చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్యబాబు(Balakrishna) కు సబంధించిన  భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయబ్తున్నట్టు తెలుస్తోంది.  నటసింహం ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. అన్ని రకాలుగా కలిసొచ్చేట్టు సీన్ రాసుకున్నారట డైరెక్టర్ మలినేని. ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన తరువాత లాంగ్ షెడ్యూల్ కోసం మూవీ సెటప్ ను కడపకు మార్చబోతున్నట్టు తెలుస్తోంది.

 ముఖ్యంగా ఈసినిమా కథ మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరుగుతుంది. దాంతో ఎక్కుబ భాగం షూటింగ్ ను అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేటపాలెం టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టే అని తెలుస్తోంది. రాయలసీమలో వేటపాలెంలో జరిగిన కథతో సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈమూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండాలో బాలయ్య (Balakrishna) ఎలివేషన్ సీన్స్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రైండ్ స్కోర్ గూజ్ బాంబ్స్ తెప్పించే విధంగా ఉంది.

దాంతో ఈ సినిమాకు కూడా బాలయ్య(Balakrishna)  ఫ్యాన్స్ ఉర్రూతలు ఊగేలా మ్యూజిక్ ను ప్లాన్ చేసుకుంటన్నాడట తమన్. ఇక ఈసినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హిరోయన్ గా నటిస్తోంది. అర్జున్, వరలక్ష్మీ శరత్ కుమార్. కన్నడ స్టార్ దునియా విజయ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.



 

 

Follow Us:
Download App:
  • android
  • ios