Asianet News TeluguAsianet News Telugu

ఈ సెన్సార్ వాళ్లు ఇక మారరు..అన్నీ మొబైల్స్ లో కనిపిస్తున్నాయిగా..బాబూ

  • బాబు బాగా బిజీ రిలీజ్ డేట్ మార్పు
  • బాహుబలితో అంతా భయపడుతుంటే... బాబు మాత్రం వచ్చేస్తున్నాడు
BABU BAGA BUSY sensor clearance effected release date

ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ నుంచే అటెన్షన్ క్రియేట్ చేసిన మూవీ బాబు బాగా బిజీ. అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమా ‘బాబు బాగా బిజీ’ మే 5కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా సినిమాలన్నీ ‘బాహుబలి: ది కంక్లూజన్’కు భయపడుతుంటే.. ఆ సినిమా రావడానికి 15 రోజుల ముందు ఏప్రిల్ 13నే రావాల్సిన ఈ చిత్రాన్ని... సెన్సార్ క్లియరెన్స్ లేక వాయిదా వేయక తప్పని పరిస్థితిరావడంతోనే డేట్ మార్చాల్సి వచ్చింది.

 

‘బాబు బాగా బిజీ’ హిందీలో హిట్టయిన అడల్ట్ కామెడీ ‘హంటర్’కు రీమేక్ అన్నది తెలిసిందే. అందులోని చాలా బోల్డ్ సీన్స్ని అదే స్థాయిలో తెలుగులోనూ తీశారని.. ఒక సీన్లో హీరో.. ఆంటీతో సెక్స్ చేసే సీన్ మరీ శ్రుతి మించి పోయిందని ఆ సన్నివేశం విషయంలోనే సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ సీన్ విషయంలో ‘బాబు బాగా బిజీ’ టీం కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తోంది. అందుకే ముందు ఈ సీన్‌ను మరోసారి తీసి, దాన్ని యాడ్ చేయకుండా పాత వెర్షన్‌తోనే రివైజ్డ్ కమిటీకి వెళ్తారట.



ఇలా చాలా సినిమాలు స్థానికంగా ఇబ్బందులు పడి.. రివైజ్డ్ కమిటీ ఆమోద ముద్ర వేయించుకున్నాయి. ‘బాబు బాగా బిజీ’ టీం కూడా ఒరిజినల్ వెర్షన్‌తోనే రివైజ్డ్ కమిటీని సంప్రదించిన యతాతథంగా ఓకే చేయించుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఒకవేళ అక్కడ కూడా అభ్యంతరాలు వ్యక్తమైతే రీషూట్ చేసిన సీన్ కలిపి సినిమాను రిలీజ్ చేస్తారట. అందుకే కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios