Asianet News TeluguAsianet News Telugu

అషురెడ్డికి మద్యం బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చిన తండ్రి.. మొత్తం ఖాళీ చేస్తుందా ఎట్టా, నేను తాగితే అంటూ పోస్ట్

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.

AshuReddy gets wine bottle as gift from her dad
Author
First Published Mar 19, 2023, 10:56 AM IST

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది. 

ఎప్పుడూ పార్టీలు, వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ పొట్టి బట్టల్లో కుర్రాళ్ళని కనువిందు చేస్తోంది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన మరింత పబ్లిసిటీ పెంచుకుంది. ఆర్జీవీ ఆమె కాలి వేళ్ళని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. అయితే అషురెడ్డికి ఇలాంటి విషయాల్లో మొహమాటం ఉండదు. బోల్డ్ గా ఉంటూ తనకి నచ్చిన పని చేస్తుంది. 

ఫ్యామిలీతో కూడా అషురెడ్డి చాలా ఓపెన్ గా ఉంటుంది. తాజాగా అషురెడ్డి చేసిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె తండ్రే స్వయంగా తనకి మద్యం బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చాడని అషురెడ్డి పోస్ట్ చేసింది. తాన్ తండ్రి ఇచ్చిన మాన్షన్ హౌస్ వైన్ బాటిల్ చూస్తూ అషురెడ్డి మురిసిపోతోంది. 'డాడీ డాటర్ మూమెంట్స్.. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నాన్నా. మా అమ్మకి మాత్రం ఈ గిఫ్ట్ నచ్చదు అంటూ అషురెడ్డి ఫన్నీగా పోస్ట్ పెట్టింది. 

AshuReddy gets wine bottle as gift from her dad

పైగా ఈ వీడియోకి బ్యాగ్రౌండ్ లో 'నేను తాగితే బార్లన్నీ ఏర్లు అవుతాయి' ర్యాప్ సాంగ్ ని కూడా పెట్టింది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి ఫాదర్ ఉండడం అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్యామిలీ చాలా అరుదుగా ఉంటుంది అని మరికొందరి ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios