బాలీవుడ్ నటితో కెమెరాలకు దొరికిపోయిన షారుఖ్ ఖాన్ తనయుడు, వైరల్ అవుతున్న ఫోటోలు
బాలీవుడ్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయాడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. పార్టీలో ఆనటితో ఎంజాయ్ చేసతూ కనిపించాడు. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

షారుఖ్ ఖాన్ .. తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ కేసులో ఆయన పేరు మారు మోగి పోయింది. బాలీవుడ్ తో పాటు దేశమంతా షారుఖ్ తనయుడి గురించి పెద్ద చర్చే జరిగింది. డ్రగ్స్ కేసు తరువాత కూడా మరికొన్ని విషయాలలో కాంట్రవర్సీలను ఫేస్ చేశాడు ఆర్యన్ ఖాన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంత పేరుంటుందో.. వారి పిల్లలకు సైతం అంతే పేరు ఉంటుంది. దాంతో సెలబ్రిటీలతో పాటుగా వారి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం అభిమానుల్లో ఉంటుంది.
అందుకే వారిపై ఓ కన్ను వేసి ఉంచుతారు. నెటిజన్లు అలా కన్నేసి ఉంచడం వల్లే.. వారు ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలిసిపోతుంది. వారు ఏపని చేసినా.. అది వైరల్ అవుతుంది. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. అందుకే ఈ మధ్య స్టార్స్ వారి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆమద్య షాకుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ చాలా ఇష్యూస్ లో ఇరుక్కుని ఇలాగే ట్రెండింగ్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి షారుఖ్ తనయుడు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. ఓ హీరోయిన్ తో పాటు పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కెమెరాకు చిక్కాడు. అయితే ఆ నటి కూడా స్వయంగా ఆ ఫోటోలను తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరు అనేకదా మీ అనుమానం..?
బాలీవుడ్ నటి రోషిని వాలియాతో కలిసి ఓ పార్టీ సందడి చేశాడు ఆర్యన్. ఆర్యన్-వాలియా కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిని. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసింది. అయితే ఈ ఫోటోలు ఈ హీరోయిన్ సూపర్ హాట్ గా కనిపించింది. ఎద అందాలు బయటపడేలా ఫోటోలు..అది కూడా ఆర్యన్ ఖాన్ తో చాలా క్లోజ్ గా దిగి పెట్టడంతో..నెట్టింట్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు చాలా హాట్ గా ఉన్నారంటున్నారు నెటిజన్లు.