బ్రేకింగ్ : మళ్ళీ నిరాశే.. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్టు
రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు ఎన్సీబీ అధికారులు సమాచారం అందుకోవడంతో రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయుడు Aryan Khan డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులకు పట్టుబడ్డాడు.
రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు ఎన్సీబీ అధికారులు సమాచారం అందుకోవడంతో రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో NCB అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 7న కోర్టు ఆర్యన్ ఖాన్ ని జ్యూడిషియల్ కస్టడీకి తరలించింది. షారుఖ్ తన కుమారుడి కోసం బెయిల్ కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టులో మాత్రం చుక్కెదురే ఎదురవుతోంది.
ఇప్పటికి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు నిరాకరించింది. మరోసారిఆర్యన్ ఖాన్ కి, షారుఖ్ కుటుంబానికి నిరాశ తప్పలేదు. బెయిల్ పిటిషన్ ని కొద్దిసేపటి క్రితమే కోర్టు తిరస్కరించింది. ఆర్యన్ ఖాన్ లాయర్ మాత్రం కోర్టులో ఎన్సీబీ కి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ లో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని అంటున్నారు. కానీ ఎన్సీబీ మాత్రం ఆర్యన్ ఖాన్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతోంది.
ఆధారాలు తారుమారు కాకుండా మరికొంతకాలం ఆర్యన్ ఖాన్ ని విచారణ చేపట్టాలని ఎన్సీబీ కోరుతుండడంతో కోర్టు అందుకు అంగీకరించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. బుధవారం ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రాడ్ జైలులో ఉంటున్నాడు.