మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేతకు అందుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ క్రేజ్ తొడవ్వడంతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేతకు అందుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ క్రేజ్ తొడవ్వడంతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. సెలవులు ఉండడం, పోటీగా ఇతర సినిమాలు లేకపోవడం అంతా కలిసొచ్చే అంశమే.

ఇక యూఎస్ లో అరవింద సమేత డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఎప్పటికప్పుడు లెక్కలు మారుతున్నాయ్. 1 మిలియన్ మార్క్ ను చాలా స్పీడ్ గా అందుకున్న తారక్ శనివారం $320,485 కలెక్షన్స్ సాధించి $1.5M మైల్ స్టోన్ ను కూడా అందుకున్నాడు. దీంతో 2 మిలియన్ మార్క్ ను అందుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది. ఆదివారం కూడా భారీగా వసూళ్లు వస్తాయి. 

తారక్ గత చిత్రాలు నాన్నకు ప్రేమతో $2.03M కలెక్షన్స్ ని రాబట్టగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా $1.81 మిలియన్స్ ను వసూలు చేసింది. మొత్తంగా అరవింద సమేత ఇప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక డాలర్లు సాధించిన మూడవ చిత్రాంగా నిలిచింది. హారిక హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ