'నిశ్శబ్ధం'...ఫస్ట్ ఎలా ప్లాన్ చేసారో తెలిస్తే మైండ్ బ్లాంక్
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'నిశ్శబ్ధం'. హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని పనులు పూర్తి చేసిన ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతోంది.
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'నిశ్శబ్ధం'. హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని పనులు పూర్తి చేసిన ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టు గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట ఈ స్క్రిప్టుని అనుకున్నట్లు గా తీస్తే కల్ట్ క్లాసిక్ అయ్యేదని వినిపిస్తోంది. ఇంతకీ మొదట ఈ సినిమాని ప్లాన్ చేసారంటే...
'నిశ్శబ్ధం' స్క్రిప్టుని మొదట టైటిల్ కు తగ్గట్లే ఓ సైలెంట్ మూవీగా ప్లాన్ చేసారట. అంటే కమల్ హాసన్ ..పుష్పక విమానం తరహాలో. సినిమా మొదట నుంచి చివరి దాకా ఎవరికీ డైలాగులు ఉండవు. అలా స్క్రిప్టు రాసుకున్నారట. కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి...ఈ జానర్ హారర్ కావటం, అప్పటి ఆడియన్స్ వేరు..ఇప్పటి మారిన యూత్ వేరు అని స్క్రిప్టుని డైలాగులుతో తిరగ రాసారాట. అయితే సినిమాలో అనుష్కకు డైలాగులు అసలు ఉండవు. దాంతో ఈ సినిమాని డైలాగులు లేకుండా తీసి ఉంటే ఎలా ఉండేదో ఓ వెర్షన్ చేస్తే బాగుండేది అంటున్నారు.
ఇక ఓ సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం'లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జరిగింది. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుందర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీరజ కోన, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ – షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంకట్, స్టోరీ & డైరెక్షన్ – హేమంత్ మధుకర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్