Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి లో అనుష్క అందాల విందు

  • బాహుబలి 2 లో కనువిందు చేయనున్న అనుష్క
  • అనుష్క గ్లామర్ కోసం పరితపిస్తున్న అభిమానులు
  • ఫ్యాన్స్ కోరిక తీరుతుందంటున్న జక్కన్న టీమ్
ANUSHKA TO SHOW GLAMOUR IN BAHUBALI2

అనుష్క వివాహం చేసుకోబోతుందన్న వార్తలతో అసంతృప్తికి గురైన ఆమె ఫ్యాన్స్... ఆమె పెళ్లి ఇప్పట్లో లేదని తేల్చేయడంతో ఆనందంతో ఉన్నారు. తాజాగా తిరిగి సినిమాలు చేసేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఆమె రీసెంట్ గా కినిపించిన మూవీస్ లో పెద్దగా గ్లామరస్ గా కనిరించలేదనే చెప్పాలి. బాహుబలిలో వృద్ధాప్యం వచ్చిన దేవసేనగా కనిపించింది. రుద్రమదేవిలో రాణిగా అలరించింది.

కానీ రుద్రమదేవి మూవీలో పున్నమి పాటలో కాస్త కవ్వించినా... ఫ్యాన్స్ కు అంత గ్లామర్ కనిపించలేదు. ఇక బాహుబలి మొదటిభాగంలో అనుష్క పాత్రను అభిమానులు అర్థం చేసుకున్నా, గ్లామర్ గా కనిపించకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు.


ఇక 'సైజ్ జీరో'లో బాగా బరువు పెరిగి కనిపించడంతో, ఆమె గ్లామర్ చూడాలనుకున్న అభిమానుల కోరిక పూర్తిస్థాయిలో తీరలేదు. అలాంటివారి కోరికను 'బాహుబలి 2' నెరవేరుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క మరింత గ్లామర్ గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో తమన్నా అందాలు ఆరబోయగా అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమాలో అనుష్క చేయనుందని తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios