పవన్ సరసన మరో యంగ్ హీరోయిన్ పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఛాన్స్ పవన్ కళ్యాణ్ సరసన అవకాశం దక్కించుకున్న అను ఎమాన్యుయెల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల యంగ్ హీరోయిన్ లతో రొమాన్స్ చేసేందుకు ప్రిఫర్ చేస్తున్నారు. అటు పాలిటిక్స్ లో బిజీ బిజీగా గడుపుతూనే... ఇటు సినిమాల్లోనూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్థుతం కాటమరాయుడు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తర్వాత త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తరవాత పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలయికలో మరో చిత్రం తెరకెక్కుతోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని దర్శక నిర్మాతలు ముందే చెప్పారు. ఓ నాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకొన్నారు. ఇప్పుడు మరో కథానాయిక కూడా దొరికేసింది. ఆ స్థానం అను ఇమ్మాన్యుయెల్‌కి దక్కింది. ‘మజ్ను’ చిత్రంతో ఆకట్టుకొంది అను. ప్రస్తుతం ‘ఆక్సిజన్‌’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల్లో నటిస్తోంది. ఓ తమిళ చిత్రానికి సంతకం చేసింది. ఇప్పుడు పవన్‌కు కథానాయికగా మారబోతోందన్నమాట. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పవన్‌ కల్యాణ్‌. ఇది ముగిసిన వెంటనే త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ చిత్రానికి అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నారు.