తమిళ తంబీల వీరాభిమానానికి హద్దులు ఉండవు. తన అభిమాన హీరో కోసం ఎంతకైనా తెగిస్తారు. తమ హీరో గొప్ప అనిపించుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు. అందుకే తమిళనాడులో ఫ్యాన్ వార్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఐదేళ్లుగా హీరో విజయ్, అజిత్ కోలీవుడ్ లో తిరుగులేని హీరోలుగా ఎదిగారు. వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ఇద్దరు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు. 

ఒక హీరోని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికిన మరో హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. కాగా ఎస్పీ బాలు అంత్యక్రియలకు అజిత్ హాజరు కాకపోవడంతో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. హీరో విజయ్ బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలు పార్దీవ దేహాన్ని సందర్శించడంతో పాటు ఎస్పీ చరణ్ ని కలిసి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కారణం ఏదైనా అజిత్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 

దీనితో విజయ్ ఫ్యాన్స్ అజిత్ పై   ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ల్స్ చేస్తున్నారు. లెజెండరీ సింగర్ చనిపోతే కనీసం సంతాపం ప్రకటించలేదని,  ఆయన పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పరిశ్రమలోని అనేక మంది ప్రముఖులు బాలు అంత్యక్రియలకు రాలేదు. విజయ్ వచ్చిన ఒక్క కారణంగా అజిత్ ని అందరూ ట్రోల్ చేస్తున్నారు.