Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ,బోయపాటి...ఇంకో అదిరిపోయే టైటిల్

బాలకృష-బోయపాటిలది సక్సస్ ఫుల్  కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  సినిమాకు సంభందించిన వార్తలు మాత్రం మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ చిత్రం టైటిల్ గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు  మొదలయ్యాయి. తాజాగా మరో టైటిల్ ఫైనల్ చేసారని, అది బాలయ్యకు తెగ నచ్చిందని సోషల్ మీడియాలో వినపడుతోంది. 

Another Title for Boyapati Srinu, Balayya movie?
Author
Hyderabad, First Published Aug 31, 2020, 12:05 PM IST

నందమూరి బాలకృష తన 106వ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష-బోయపాటిలది సక్సస్ ఫుల్  కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  సినిమాకు సంభందించిన వార్తలు మాత్రం మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ చిత్రం టైటిల్ గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు  మొదలయ్యాయి. తాజాగా మరో టైటిల్ ఫైనల్ చేసారని, అది బాలయ్యకు తెగ నచ్చిందని సోషల్ మీడియాలో వినపడుతోంది. 

వివరాల్లోకి వెళితే...ప్ర‌స్తుతం ఈ సినిమాకి వ‌ర్కింగ్ టైటిల్‌గా బిబి3 అని వ్యవహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రెండు, మూడు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. మోనార్క్‌, డేంజ‌ర్ అనే టైటిల్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. తాజాగా ‘టార్చ్‌ బేరర్‌’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. బాల‌య్య‌, బోయ‌పాటి ‘టార్చ్‌ బేరర్‌’  అనే టైటిల్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చెప్తున్నారు. జనాన్ని ముందుడి నడిపే నాయకుడిని ‘టార్చ్‌ బేరర్‌’ అంటారని, కథ ప్రకారం బాలయ్య ఈ సినిమాలో అదే చేస్తాడని  అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు. 

కాబ‌ట్టి ఈ టైటిల్‌ను బాల‌కృష్ణ సినిమాకి పెట్టడంలో ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. ఇదే టైటిల్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే ఈ టైటిల్ పై అభిప్రాయం తెలుసుకోవటానికే ప్రచారంలోకి తెచ్చారని కొందరు అంటున్నారు.
 
ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.  
 
బోయపాటి మాట్లాడుతూ.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. "సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios