టాలీవుడ్ సెక్స్ రాకెట్: యాంకర్ లాస్యను కూడా అడిగారంట!

anchor lasya comments on tollywood sec racket
Highlights

నేను దానికి అంగీకరించలేదని.. 'నువ్వెంత ఆఫ్ట్రాల్' అన్నారు 

మొన్నటివరకు కాస్టింగ్ కౌచ్ తో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ ఇప్పుడు సెక్స్ రాకెట్ లో ఇరుక్కుంది. టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోయిన్లు, నటీమణులు అమెరికాలో ఈవెంట్ల పేరుతో వ్యభిచారం చేస్తున్నారని చికాగోలో ఉండే ఓ తెలుగు ఫ్యామిలీ సెక్స్ దందా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే తనను కూడా సెక్స్ లో పాల్గొనమని ఒత్తిడి చేసినట్లు యాంకర్ లాస్య ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంపై స్పందించింది.

అమెరికాలో 'షాపింగ్'కు ఒప్పుకుంటారా అని అడుగుతారు. అక్కడ షాపింగ్ అంటే కమిట్మెంట్ అని లాస్య చెప్పింది. పద్దతిగా కనిపించే వాళ్లను కూడా విడిచిపెట్టరని వాపోయింది. ''నాకు తెలిసిన ఓ పెద్ద ఆర్టిస్ట్ అమెరికా వెళ్లి బాగా సంపాదించానని గర్వంగా చెప్పింది. ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికాలో నెల రోజుల్లో ఆమె రూ.80 లక్షలు సంపాదించింది. అది ఆమె రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. న్యూజెర్సీకు చెందిన ఒకతను పెద్ద ఆర్టిస్టులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు. ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నేను రివర్స్ అయ్యేసరికి పెద్ద పెద్ద యాంకర్లతో నేను పడుకున్నా.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అంటూ నా దగ్గరకి రాకపోతే నువ్వు అమెరికాలో స్టేజ్ ఎక్కలేవని బెదిరించాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క ఈవెంట్ కు కూడా వెళ్లలేదు. మొదట్లో ఈవెంట్స్ చేసేదాన్ని కానీ ఎప్పుడైత ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తించారో.. అప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అందుకే మళ్లీ నన్ను పిలవరు. పెళ్లైన అమ్మాయని కూడా చూడరు. వారికి కావలసినట్లు ఉండాలని  కోరుకుంటారు. తానా, ఆటాలలో ఉన్నవాళ్లంతా పెద్ద వెధవలే'' అంటూ చెప్పుకొచ్చింది. 

loader