అమలాపాల్ లేటెస్ట్ మూవీ 'ఆమె' జులై 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా ఓ సన్నివేశంలో నటించడం హాట్ టాపిక్. 

అమలాపాల్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అమలాపాల్ బోల్డ్ పాత్రలో నటించడానికి కూడా సిద్దపడుతోంది. అమలాపాల్ లేటెస్ట్ మూవీ 'ఆమె' జులై 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా ఓ సన్నివేశంలో నటించడం హాట్ టాపిక్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమలాపాల్ న్యూడ్ సీన్స్ లో నటించిన దృశ్యాలని టీజర్ లో చూపించారు. దీనితో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ తన మాజీ భర్త ఏఎల్ విజయ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి విజయ్ ఒప్పుకోలేదు అందుకే విడిపోయారా అని ప్రశ్నించగా.. విజయ్ గురించి అలాంటి కామెంట్ నేనెప్పుడూ చేయలేదని, కారణం అది కాదని అమల తెలిపింది. 

విజయ్ ఇటీవల ఐశ్వర్య అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నాడు. దీనిపై అమలాపాల్ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక కథ నచ్చితే భవిష్యత్తులో కూడా 'ఆమె' లాంటి బోల్డ్ చిత్రాల్లో నటిస్తానని అమల తెలిపింది. ఉదాహరణగా డర్టీపిక్చర్ చిత్రాన్ని వివరించింది. ఆ చిత్రంలో గ్లామర్ గా నటించేందుకు ఓ కారణం ఉంది. అలాంటి కథలు వస్తే చేయడానికి తనకు అభ్యంతరం లేదని అమల తెలిపింది.