స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఖాళీ సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేసేందుకు ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా తన పిల్లలు చేసి అల్లరి పనులను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసి పోతుంటాడు బన్నీ. ఇప్పటికే బన్నీ కొడుకు అల్లు అయాన్‌, కూతురు అర్హలకు మంచి ఫాలోయింగ్‌. అల వైకుంఠపురములో సినిమాలోని ఓ మై గాడ్ డాడీ పాటకు ఈ చిన్నారు చేసిన అల్లరి అప్పట్లో మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. తాజాగా ఈ చిన్నారి స్టైలిష్‌ స్టార్‌ తనలోని మరో టాలెంట్‌ను కూడా చూపించాడు.

తాజాగా అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌ చెఫ్‌గా మారిపోయాడు. స్వయంగా ఫ్రూట్ సలాడ్‌ తయారు చేశాడు. ఈ వీడియో ను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. వీడియాలో చిన్నారి అయాన్‌ సలాడ్‌ ఎలా తయారు చేయాలో తన ముద్దు ముద్దు మాటలతో వివరిస్తున్నాడు. అంతేకాదు సలాడ్‌ తింటే విటమిన్లు అందుతాయి బలం వస్తుందని చెప్పాడు అల్లు అయాన్. ఈ వీడియోతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో మరోసారి అల్లు వారసుల సందడి సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పుష్ప సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Salad :)

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on May 12, 2020 at 11:45pm PDT