టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అక్కినేని ప్యామిలీకి చెందిన.. నాగార్జున మేనకోడలు సుప్రియాను అడివి శేష్ పెళ్ళాడబోతున్నట్టువార్తలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. అక్కినేని వారి ఇంటి అమ్మాయి.. కింగ్ నాగార్జున మేనకోడలు, హీరో సుమత్ సొదరి సుప్రియ. అవును అఫీషియలం గా ఈ విషయాన్ని ఎవరూ అనౌన్స్ చేయకపోయినా.. వీరి పెళ్ళి డేట్ మాత్రం ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా అడివి శేష్, సుప్రియ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు సహజీవనం కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.
ఇండస్ట్రీలో విరిపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే ఎప్పడు ఈ విషయంలో స్పందించలేదు ఇద్దరు స్టార్లు. కాకపోతే మీడియా వీరిపై ఎప్పుడూ కన్నేసి ఉంచింది. ఆమధ్య ఇద్దరు ఈ ఏడాది పెళ్లి చేసుకోబొతుననట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కొంత కాలానికి అవి సర్ధుమనిగాయి. కాని ఈసారిమాత్రం ఏకంగా పెళ్లి డేట్ బయటకు వచ్చింది. అది కూడా ఈ నెల 16నే వీరిద్దరు పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం బలంగాప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా అడవి శేష్ నుంచి కాని.. అక్కినేని ఫ్యామిలీ నంచి కూడా ఎటువంటి ప్రకటనలు రాలేదు.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కు స్పెషల్ ఇమేజ్ ఉంది. అందరు హీరోల మాదిరిక కాకుండా.. కొత్తగా ఆలోచిస్తాడు అడివి. కథా బలం ఉన్న సినిమాలు చేసుకుంటూ... తన ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంతే కాదు శేష్ తో కలిసి సుప్రియ గూఢచారి సినిమాలో నటించింది. ఈ హీరో సినిమాలకు సబంధించిన ప్రతీ పనిలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ఆతరువాత నిర్మాతగా కూడా మారారు. టాలీవుడ్ ఏదో ఒక రోల్ పోషిస్తూ.. అప్పుడుప్పుడు మెరుస్తున్నారు.
అయితే వీరి రిలేషన విషయంలో పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఇంకా లేట్ చేయకుండాపెళ్లి చేసుకోవాలని చూస్తున్నారట. మరి ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారా...? లేక గుట్టుచప్పుడు కాకుండా పెల్ళి చేసుకుంటారా..? లేక ఇదంతా సోషల్ మీదియా ప్రచారం వరకే ఆగిపోతుందా అనేది చూడాలి. నెట్టింట్లో షికారు చేస్తున్నన్యూస్ ప్రకారం ఈ నెల 16న వీరి పెళ్లి జరగబోతోంది. మరి అది ఎంత వరకూ నిజం అవుతుందో చూడాలి.