లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎవరికీ సాధ్యం కాని విధంగా వేలపాటలు పాడారు. అనేక భాషల్లో పాటలు పాడారు. ఆయన్ని భారతరత్నతో గౌరవించాలని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

బాలు ఐదున్నర దశాబ్దాల కెరీర్‌లో 45వేల పాటలు పాడారు. మనం రోజుకు నాలుగైదు పాటలు విన్నా ఎక్కువ అనిపిస్తుంది. అలాంటి బాలుగారు వేల పాటలు పాడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బాలుగారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో పాటలు పాడారు. బాలు పాట లేకుండా ఆయా పరిశ్రమలు లేవు. 

బాలు గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. గ్రేట్‌ సింగర్‌. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలు రావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను అన్ని పరిశ్రమలు కలిసి బాలుగారిని భారతరత్న ఇచ్చి గౌరవించాలి. అందుకోసం అన్ని చిత్ర పరిశ్రమలు ముందుకొచ్చి పోరాడాలని అర్జున్‌ డిమాండ్‌ చేశారు. అర్జున్‌.. బాలు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అంత్యక్రియాల్లో పాల్గొన్న కొద్ది మంది సెలబ్రిటీల్లో ఆయన ఒకరు. ప్రముఖంగా సూపర్‌ స్టార్‌ విజయ్‌, భారతీరాజా, దేవిశ్రీప్రసాద్‌ ఇందులో స్వయంగా పాల్గొన్నారు.