MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్

Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 19వ తేదీ)లో దీపకు కాపలాగ పారిజాతాన్ని పెట్టిన జ్యో. ఆపరేషన్‍కి రెడీ చేసిన డాక్టర్. దాసు సాయంతో శౌర్య జాడ తెలుసుకున్న కార్తీక్. కత్తితో కార్తీక్ ని పొడవబోయిన రౌడీలు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

4 Min read
Author : Kavitha G
Published : Mar 19 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ గురువారం ఎపిసోడ్‌లో సుమిత్రను ఆపరేషన్ కి సిద్ధం చేయడానికి, దీప ఇక్కడే ఉండాలి అనడానికి సంబంధం ఏంటి డాక్టర్ అని అడుగుతుంది పారు. డాక్టర్ హారిక కంగారుపడుతూ కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. బయట ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్తుంది దీప. లేదు వెళ్లిపోయాడు అంటుంది పారు. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని దీపను గదిలోకి పంపిస్తుంది డాక్టర్. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి డాక్టర్ ని విసిగిస్తుంది పారు. అందరికీ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మా టెన్షన్స్ మాకు ఉంటాయి. మీరు మరోసారి నన్ను ప్రశ్నలు అడగకండీ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది డాక్టర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
శౌర్య దొరకదన్న జ్యో
Image Credit : Jiohotstar

శౌర్య దొరకదన్న జ్యో

నేను ఏమన్నానని డాక్టర్ అంత చిరాకు పడుతుంది అని మనసులో అనుకుంటుంది పారు. అంతలో జ్యోత్స్న వచ్చి అంతా ఓకేనా గ్రానీ అని అడుగుతుంది. నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను అని చెప్తుంది పారు. లోపల దీప, బయట కార్తీక్ గాడు కూతురి కోసం టెన్షన్ పడుతుంటారు అంటుంది పారు. ఆపరేషన్ అయ్యే వరకు శౌర్య బావకు దొరకదు అంటుంది జ్యోత్స్న.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు తాత రిక్వెస్ట్- కూతురి కోసం దశరథ హోమం- దాసుకు షాక్
Related image2
Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్
38
దీప కంగారు
Image Credit : Jiohotstar

దీప కంగారు

కూతురి కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. దీప ఫోన్ చేసి శౌర్య గురించి అడుగుతుంది. నీకెలా తెలుసు అంటాడు కార్తీక్. పారిజాతం చెప్పిందని చెప్పగానే... ఇది జ్యోత్స్న కుట్రేనని కన్ఫర్మ్ చేసుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న మనల్ని ఆపేందుకు ఇవన్నీ చేస్తోంది. శౌర్యకు ఏం కాదు. నా కూతురుకు నేను ఏం కానివ్వను. మీ అమ్మకు నువ్వు ఏం కానివ్వకు అని ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్.

48
దాసు హెల్ప్
Image Credit : Jiohotstar

దాసు హెల్ప్

కాసేపటికి కార్తీక్‌కు దాసు ఫోన్ చేసి శౌర్య ఉన్న ప్లేసు తనకు తెలుసని లొకేషన్ షేర్ చేసి రమ్మంటాడు. కార్తీక్ అక్కడికి వెళ్తాడు. మరోవైపు తన గదిముందు కాపలాగా ఉన్నపారిజాతం దగ్గరికి వెళ్లి నీ సమస్య ఏంటి పారిజాతం గారు.. ఎందుకు ఇక్కడ ఉన్నారు. శౌర్య కిడ్నాప్ అయిందని నీకెలా తెలుసు అని నిలదీస్తుంది దీప. ఎలాగో తెలుసు అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది పారు.

కార్తీక్, దాసు దగ్గరికి వెళ్లగానే.. జ్యోత్స్న ఇలాంటి పని చేస్తుందన్న ఆలోచనతోనే నేను మీ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచాను. నేను అనుకున్నట్లుగానే ఇద్దరు రౌడీలు శౌర్యను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లను ఫాలో అవుతూ నేనూ ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు దాసు. 

58
కార్తీక్ కి తప్పిన ప్రమాదం
Image Credit : Jiohotstar

కార్తీక్ కి తప్పిన ప్రమాదం

రౌడీల దగ్గరికి వెళ్లి, వాళ్లతో ఫైట్ చేస్తారు కార్తీక్, దాసు. ఇద్దరు రౌడీలు కార్తీక్ ని పట్టుకుంటే మరొకరు కత్తితో పొడవడానికి వస్తారు. అప్పుడే దశరథ చేస్తున్న హోమ గుండంలో నుంచి మంటలు ఎగిసిపడతాయి. కంగారుపడి నేను హాస్పిటల్ కి వెళ్తాను గురువు గారు అంటాడు దశరథ. నువ్వు లేవకు. ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది. నువ్వు నిష్ఠగా హోమం పూర్తి చేయమని చెప్తాడు గురువు. మరోవైపు రౌడీ, కార్తీక్ ని కత్తితో పొడవబోతుంటే, కర్రతో కొట్టి ఆపేస్తాడు దాసు. ఆ తర్వాత శౌర్య దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్తాడు కార్తీక్. శ్రీధర్ కి ఫోన్ చేసి శౌర్యను తీసుకెళ్లమని చెప్తాడు.

మరోవైపు సుమిత్ర, జ్యోత్స్నలను ఆపరేషన్ కి సిద్ధం చేస్తుంది డాక్టర్. నేను నిజంగానే సొంత కూతురు అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఇప్పుడు అన్నీ బయటపడతాయి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. డాక్టర్, జ్యోను పిలిచి అటు తిరుగు ఈ ఇంజక్షన్ వేయాలి అని చెప్తుంది. ఇంజక్షన్ వేయడంతో మత్తులోకి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

68
దీపకు శత్రువులు
Image Credit : Jiohotstar

దీపకు శత్రువులు

మరోవైపు శౌర్యను ఇంటికి తీసుకెళ్తాడు శ్రీధర్. ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్లాలి కదా.. నీవల్ల మేము ఎన్ని మాటలు పడాల్సి వచ్చేదో తెలుసా అని శౌర్యను తిడుతుంది కాంచన. నువ్వు ఆగు కాంచన.. తనని లోపలికి వెళ్లనివ్వు అని, శౌర్యను లోపలికి పంపిస్తాడు శ్రీధర్. శౌర్యను ఎవరో కిడ్నాప్ చేశారు. కార్తీక్ కాపాడి తీసుకొచ్చాడు అని కాంచనతో చెప్తాడు శ్రీధర్. ఎవరు చేసుంటారు అని, జ్యోత్స్నపై అనుమానపడుతుంది కాంచన.

సుమిత్ర ఆపరేషన్ టైమ్‌లో జ్యోత్స్న అలా చేస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ మన కొడుకు, కోడలు మాత్రం ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతోంది అంటాడు శ్రీధర్. దీపకు ఎవరో బలమైన శత్రువులు ఉన్నారండి. ఆ రోజు కత్తితో పొడిచారు. మళ్లీ పొడవడానికి వచ్చారు. శౌర్యను కిడ్నాప్ చేశారు అని జరిగిన విషయాలను తలుచుకొని కంగారు పడుతుంది కాంచన. 

వాళ్లు ఎవరైనా కార్తీక్ వదిలిపెట్టడు అంటాడు శ్రీధర్. చెప్పడం మర్చిపోయాను దీపకు ఈ రోజు ఆపరేషన్ అంటాడు శ్రీధర్. బిడ్డ బ్రతుకుతుందా అని బాధపడుతూ అంటుంది కాంచన. ఏం జరిగినా తట్టుకోడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి బాధపడతాడు శ్రీధర్.

78
పారుకు షాక్
Image Credit : Jiohotstar

పారుకు షాక్

దీపను చూసి నువ్వు ఎంత ఎదురుచూసిన కార్తీక్ గాడు రాడే అని మనసులో అనుకుంటుంది పారు. అప్పుడే వచ్చిన కార్తీక్, ఏంటి పారు మా ఆవిడకు కాపాల కాస్తున్నావా అంటాడు. ఏంట్రా అప్పుడే వచ్చేశావు అంటుంది పారు. వెళ్లిన పని పూర్తి చేసి వచ్చా.. అదంతా తర్వాత క్లియర్‌గా చెప్తానులే అని దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్.

88
డాక్టర్ టెన్షన్
Image Credit : Jiohotstar

డాక్టర్ టెన్షన్

శౌర్య గురించి కంగారుగా అడుగుతుంది దీప. రౌడీ సేఫ్‌గా ఉంది. ఇంటికి పంపించాను. కిడ్నాప్ చేయించింది జ్యోత్స్ననే అని చెప్తాడు కార్తీక్. అది మనిషేనా.. పెద్దవాళ్ల మీద కోపాన్ని పిల్లల మీద చూపిస్తుందా అని ఆవేశపడుతుంది దీప. ముందు అత్తకు ఆపరేషన్ జరగనివ్వు. ఆ తర్వాత చూసుకుంటా వాళ్ల పని అంటాడు కార్తీక్. 

అంతలో డాక్టర్ వచ్చి, ఈ టెన్షన్ తో గుండెపోటు వచ్చేలా ఉంది కార్తీక్ అంటుంది. మీరు టెన్షన్ పడకండి అంటాడు కార్తీక్. బయట శివన్నారాయణ, పారిజాతం గారు ఉన్నారు. నేను దీపను ఎలా తీసుకెళ్లి ఆపరేషన్ చేయాలి అని అంటుంది డాక్టర్. పారును నేను పంపిస్తాను కదా అంటాడు కార్తీక్. గది బయట ఉన్న పారు ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్లు ఇంత టెన్షన్ పడుతున్నారని మనసులో అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు తాత రిక్వెస్ట్- కూతురి కోసం దశరథ హోమం- దాసుకు షాక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved