కరోనా కారణంగా ప్రపంచం అంతా ఇంటికే పరిమితమైంది. రోజు ఉదయం ఆఫీస్‌లకు వెళితే సాయంత్రమే తిరిగి ఇంటికి వచ్చే ఉద్యోగస్తులు కూడా ప్రస్తుతం రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హాట్ బ్యూటీ సన్నిలియోన్‌ భర్త కూడా ఇలాంటి కంప్లయింట్‌ ఇచ్చాడు. ఓ వీడియోలో తనను భార్య సన్నీ ఎలా ఇబ్బంది పెడుతుందో వివరించాడు ఆమె భర్త డానియల్‌ వెబర్.

డానియెల్‌ సరదాగా చేసి ఈ వీడియోపై సన్నిలియోన్‌ ఆసక్తికరంగా స్పందించింది. ఈ వీడియోలో డానియెల్‌ కొన్ని ప్లకార్డ్‌ల ను చూపించాడు. అందులో `ఆమె రోజంతా నిద్రపోతుంది. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ వంట దారుణం. ఆమె చాలా బద్దకస్తురాలు. ఎప్పుడు పైజామాలోనే ఉంటుంది. రోజంతా సెల్ఫీలు దిగుతూనే ఉంటుంది` అంటూ కామెంట్ చూపించాడు. ఆ వీడియో తీస్తున్న సమయంలో సన్ని అక్కడే ఉన్నా డానియెల్ చెప్పే విషయాన్ని గుర్తించలేదు.

తరువాత వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన సన్ని`ఇప్పుడే దీన్ని చూశా.. రేపు నిజంగా డానియెల్‌ రోజంతా ఏం చేస్తాడో చూపిస్తా. రివేంజ్‌` అంటూ కామెంట్‌ చేసింది. హాట్ షోతో ఆడియన్స్‌ను అలరించే సన్ని.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఈ భామ బేబీ డైపర్‌ను మాస్క్‌లా ధరించటంతో ఇతర మాస్క్‌ల తయారికి సంబంధించి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Just a quick update from Sunny and I !!! Hope your all safe and doing as well as we are 😁

A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on Apr 19, 2020 at 2:50am PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hmmm...just saw this! Tomorrow I will show you what @dirrty99 is really doing all day! REVENGE!! It’s on!

A post shared by Sunny Leone (@sunnyleone) on Apr 19, 2020 at 12:06pm PDT